ఉచితంగా 8 లక్షల టన్నుల ఆహార ధాన్యాల పంపిణీ

విధాత:ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం కింద గత ఏడాది మే, జూన్‌ మాసాలలో వలస కార్మికులు, వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుబడిపోయిన వలస కార్మికులు, రేషన్‌ కార్డులు లేని వారికి ఉచితంగా పంపిణీ చేసేందుకు 8 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలను వివిధ రాష్ట్రాలకు కేటాయించినట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి రాజ్యసభలో వెల్లడించారు. ఈ ఆహార ధాన్యాలు లబ్ధిదారులకు సక్రమంగా చేరుతున్నాయో లేదో పర్యవేక్షించేదుకు 12 మానిటరింగ్‌ సంస్థలను […]

ఉచితంగా 8 లక్షల టన్నుల ఆహార ధాన్యాల పంపిణీ

విధాత:ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం కింద గత ఏడాది మే, జూన్‌ మాసాలలో వలస కార్మికులు, వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుబడిపోయిన వలస కార్మికులు, రేషన్‌ కార్డులు లేని వారికి ఉచితంగా పంపిణీ చేసేందుకు 8 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలను వివిధ రాష్ట్రాలకు కేటాయించినట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి రాజ్యసభలో వెల్లడించారు.

ఈ ఆహార ధాన్యాలు లబ్ధిదారులకు సక్రమంగా చేరుతున్నాయో లేదో పర్యవేక్షించేదుకు 12 మానిటరింగ్‌ సంస్థలను నియమించినట్లు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పారు.రేషన్‌ షాప్‌లలో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ కారణంగా ఎలక్ట్రానికి పాయింట్‌ ఆఫ్‌ సేల్ (ఈ-పోస్‌) పరికరాలు పనిచేయని సమస్యపై ఆయా రాష్ట్రాలతో సవివరంగా చర్చించినట్లు ఆమె చెప్పారు. ఒన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌ పథకం కింద లబ్ధిదారులు తమకు అందుబాటులో ఉన్న రేషన్‌ షాప్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.