అఫ్రికన్ పైధాన్ జంట హల్చల్ !

కెన్యాలోని క్రెసెంట్ ద్వీపంలో ఆఫ్రికన్ రాక్ పైథాన్ జంట బొరియాలోకి వెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. భారీ పరిమాణం భయాందోళన కలిగిస్తోంది.

ద్వీప ప్రాంతాలలో ఒకటిగా పేరొందిన కెన్యాలోని నైవాషా సరస్సులో ఉన్న క్రెసెంట్ ద్వీపం అభయారణ్యం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అత్యంత ప్రసిద్ధ వన్యప్రాణుల అభయారణ్యం క్రెసెంట్ ఐలాండ్ గేమ్ శాంక్చురీ. నైరోబీకి సమీపంలో ఉన్న ఈ ప్రదేశం సరస్సు నీటి మట్టాల మేరకు ఒకసారి ద్వీపంలా..మరోసారి ద్వీపకల్పంగా కనిపిస్తుంది. ఇది ఒక అగ్నిపర్వత అవశేషంగా ఈ ద్వీపం మనుగడలోకి వచ్చింది. దీని నెలవంక ఆకారం కారణంగా క్రెసెంట్ ఐలాండ్ అని పేరు వచ్చింది.

జిరాఫీలు, జీబ్రాలు, వాటర్ బక్‌లు, ఇంపాలాలు, వివిధ రకాల పక్షులు ఇక్కడ కనిపిస్తాయి. సింహాలు, చిరుతలు వంటి క్రూర మృగాలు ఉండనందునా పర్యాటకులు జంతవులతో కలిసి ఈ ద్వీపంలో సంచరిస్తూ వన్యప్రాణులను వీక్షించవచ్చు. ప్రధాన పాము జాతులలో ఆఫ్రికన్ రాక్ పైథాన్‌లు కూడా ఇక్కడ తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటాయి. తాజాగా ప్రమాదకరమైన ఈ ద్వీపంలో చిత్రీకరించిన ఓ వీడియోలో ఆఫ్రికన్ రాక్ పైథాన్‌ లు జంటగా భూమి బోరియాలోకి వెలుతున్న దృశ్యం వైరల్ గా మారింది. ఆ జంట పైథాన్లు కలిసి బొరియాలోకి వెలుతుండగా చిత్రీకరించిన వీడియోలో ఆ పాముల భారీ ఆకారం..పొడవు చూస్తే ఒళ్లు జలధరించకమానదు.

ఆఫ్రికన్ రాక్ పైథాన్‌ లు ఒకేసారి పెట్టే గుడ్లలో సుమారు 40 పిల్లలు ఉంటాయట. వాటిలో కేవలం నాలుగు లేదా ఐదు మాత్రమే పెద్దవయ్యే వరకు బ్రతుకుతాయని నిపుణులు వెల్లడించారు. ఈ పైధాన్లు రెచ్చగొట్టినప్పుడు లేదా బెదిరించినప్పుడు తప్ప.. సాధారణంగా దూకుడుగా ప్రవర్తించవని, చాల అరుదుగా మనుషులపై దాడి చేస్తాయని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి :

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వానికి, విద్యార్థులకు హైకోర్టు షాక్..
నర్మదలో దారుణం: బర్గి డ్యామ్​లో పడవ మునిగి 9 మంది మృతి | నిర్లక్ష్యంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం

Latest News