Cow Smuggling | ఇన్నోవా కార్లలో గోవుల దొంగతనం..వైరల్ గా వీడియో

సికింద్రాబాద్‌లో ఇన్నోవా కారులో గోవులను మత్తు ఇంజక్షన్లతో ఎత్తుకెళ్లిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వరుసగా పశువుల దొంగతనంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Cow Smuggling  | ఇన్నోవా కార్లలో గోవుల దొంగతనం..వైరల్ గా వీడియో

Cow Smuggling | విధాత, హైదరాబాద్ : గతంలో ఆవులు, ఎద్దులను రైతుల వ్యవసాయ క్షేత్రాల నుంచి పశువుల దొంగలు ఎత్తుకెళ్లి మాంసం విక్రయశాలలకు అక్రమంగా విక్రయించడం తెలిసిందే. అయితే అదంతా రిస్క్ అనుకున్నారో ఏమోగాని పశువుల దొంగలు తమా రూట్ మార్చినట్లున్నారు. పట్టణాల్లో ఆవులు, ఎద్దులను ఎత్తుకెళ్లే పని పెట్టుకున్నారు. ఖరీదైన కార్లలో వచ్చిన దొంగల గ్యాంగ్ ఆవులకు మత్తమందు ఇచ్చి వాటిని హింసిస్తూ ఎత్తుకెలుతున్న రెండు ఘటనలు వెలుగు చూశాయి.

సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ బండిమెట్ ప్రాంతంతో దొంగల ముఠా ఓ ఆవుల దొడ్ల వద్దకు వచ్చి ఆవులకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి వాటిని ఇన్నోవా కార్ వెనుక భాగంలో వెసుకుని ఎత్తుకెలుతున్న ఘటన దృశ్యాల వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

అంతకుముందు రోజు రాత్రి మారేడుపల్లిలో కూడా ఇదే తరహాలో కారులో వచ్చిన దొంగల ముఠా ఆవులను ఎత్తుకెళ్లింది. వరుసగా జరిగిన పశువుల చోరీ ఘటనలపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగల ముఠా ఎవరూ..ఎత్తుకెళ్లిన ఆవులను ఏం చేస్తున్నారన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందు జూలై నెలో నిర్మల్‌ జిల్లా భైంసా మండలం సుంక్లి గ్రామంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.