భారీ కొండచిలువ..పక్కనే పిల్లలు..!

విధాత : ఓ భారీ కొండచిలువ..పక్కనే ఇద్దరు పిల్లలు..గట్టిగా ఆకలేస్తే అమాంతం వారిని మింగేయడం దానికి చాక్లెట్ చప్పరించినంత పని. అయితే ఆ ఇంట్లో ఆ పిల్లలు మాత్రం అంతపెద్ద అనకొండను చూసిన జడుసుకోలేదు. దాంతో ఆటలాడుతూ కనిపించారు.పైగా ఆ ఇంటి ఆవరణలో దానికో గూడు కూడా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదంతా భారీ కొండచిలువలకు ఆవాసమైన ఇండోనేషియాలో సాక్షాత్కరించింది. ఇలాంటి భారీ కొండచిలువలు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లో ఎక్కువగా కనిపిస్తూనే ఉంటాయి. ఇవి తరచుగా చిన్న చిన్న జంతువులపై దాడులు చేస్తుంటాయి. అలాగే మనుషులను మింగేందుకు కూడా అరుదుగా ప్రయత్నిస్తుంటాయని అధికారులు చెబుతున్నారు.
ఇటీవల ఇండోనేషియాలో 26 అడుగుల భారీ కొండచిలువ ఓ మనిషినే మింగేసిన ఘటన సంచలనం రేపింది. ఆగ్నేయ సువేసిలోని దక్షిణ బుటన్ జిల్లాలో ఉదయం పొలం వద్దకు వెళ్లిన రైతును ఆ భారీ కొండచిలువ మింగేసింది. పొలం వద్దకు వెళ్లిన రైతు తిరిగి రాకపోవడంతో అతడి కోసం వెతకగా..ఓ కొండ చిలువ భారీ పొట్టతో కనిపించింది. స్థానికులు అది ఏదో భారీ జంతువును మింగి ఉంటుందని భావించారు. దాన్ని చీల్చిచూడగా.. కడుపులో రైతు మృత దేహాన్ని చూసి అక్కడివారు షాకయ్యారు. 2017లో కూడా ఇండోనేషియాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆ సమయంలో 23 అడుగుల భారీ కొండచిలువ ఉబ్బిపోయి కనిపించింది. దాన్ని చీల్చి చూడగా అందులో 25 ఏళ్ల యువకుడి మృతదేహాన్ని చూసి అక్కడి స్థానికులు కంగుతిన్నారు. అయినప్పటికి ఇండోనేషియా వాసులు కొండచిలువలకు బెదిరిపోకుండా వాటితోనే సావాసం చేస్తుండటం అక్కడ ఫ్యాషన్ గా మారింది.
Meanwhile in Indonesia 🤯 pic.twitter.com/jR3i3NwUYg
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 12, 2025