Viral Video: అలిగిన సింహరాజు.. బుజ్జగించిన సివంగి!
విధాత: మనుషుల్లోనే కాదండోయ్..జంతువుల్లోనూ అలకలు..అభ్యర్థనలుంటాయి మరి. ఇందుకు ఆడవిలో ఓ సింహాల జంట ముచ్చట నిదర్శనంగా నిలిచింది. చిరు జల్లులు పడుతున్న వేళ ఓ భారీ సింహరాజం వర్షంలో తడుస్తూ మౌనంగా నిలడింది. అదే సమయానికి తన జంట ఆడ సింహం మగ సింహం వద్ధకు వచ్చి ఓ లిప్ కిస్ ఇచ్చి.. గోముగా తన తలతో దాని తలను, ఒంటిని నిమురుతూ గారాలు పోయింది. తన వెంట రమ్మన్నట్లుగా సంకెతాలిచ్చి ముందుకు కదిలింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వర్షంలో ఆ సింహాల జంట ముద్దు ముచ్చటలపై రకరకాల సరాదా కామెంట్లతో సందడి చేస్తున్నారు. వర్షంలో తడిసింది చాల్లేగాని రండి లోపలికి! పౌరుషానికేం తక్కువలేదు..ఇప్పుడు నేనేమన్నాననీ? ఏదో కోపంలో ఓ మాటంటే వచ్చి వర్షంలో నిలబడాలా ?! అని సివంగి తన సింహరాజును బతిమాడినట్లుగా కామెంట్ పెట్టారు.
మరో నెటిజన్ చిటపట చినుకుల మజాను చెలికాడు సింహరాజు ఆస్వాదిస్తుండగా..ఎక్కువ తడిస్తే బాగోదని సివంగి వారిస్తుందని కామెంట్ పెట్టాడు. మరోకరమో తడిసింది చాలుగాని పొందుకురా అన్నట్లుగా సివంగి వ్యవహారం ఉందని కామెంట్ పెట్టాడు. మరి మీకేమనిపిస్తుందో ఈ వీడియో చూసి చెప్పుకోండి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram