భారీ శరీర నిర్మాణాన్ని కలిగి ఉండే అనకొండలు, కొండ చిలువలు(పైథాన్లు) ఆహారం కోసం జంతువులను వేటాడి మింగేయడంలో తమ శరీరాన్ని లాఘవంగా వాడుతుంటాయి. తాజాగా ఓ భారీ కొండ చిలువ నది ఒడ్డున నీటిలో ఓ మొసలిపై దాడి చేసి మింగేసిన వీడియో ఒకటి వైరల్ మారింది.
ఒడ్డున నీటిలో తుప్పల వంటి ప్రాంతంలో మాటు వేసిన కొండ చిలువ తన సమీపానికి వచ్చిన చిన్న మొసలిపై దాడి చేసి, దాన్ని తన ఆహారంగా చేసుకుంది. ముందుగా కొండ చిలువ మొసలిని గట్టిగా చుట్టేసి దానిని కదలకుండా చేసి..ఊపిరి ఆడకుండా చంపేసి..నెమ్మదిగా తన నోటితో మింగడం కొనసాగించింది. కొండ చిలువ పట్టు నుంచి తప్పించుకునేందుకు మొసలి చేసిన పోరాటానికి దాని బలం సరిపోక ప్రాణాలు కోల్పోక తప్పలేదు. కొండచిలువ మొసలిని వేటాడి మింగిన వీడియో చూస్తూ ఒళ్లు జలదరించక మానదు.
అడవులు, నదులలో కొండచిలువలకు, మొసళ్లకు మధ్య తరుచూ ఆహారం కోసం పోరాటాలు కొనసాగుతుంటాయి. అమెజాన్ నది పరివాహకంలో, ఫ్లోరిడాలో, ఆస్ట్రేలియాలో పెద్ద కొండచిలువలు చిన్న అలిగేటర్లను, మొసళ్లను వేటాడిన కేసులు భారీగా నమోదవుతుంటాయి. ఆహారపు వేటలో ఒక్కోసారి ఒక్కో జంతువుది పై చేయి అవుతుంది. ఓడిన జంతువు ప్రత్యర్థికి ఆహారంగా మారిపోతుంటుంది. ప్రకృతిలో చిన చేపను పెద్ద చేప మింగేసినట్లుగా..బలమైన జంతువుకు బలహీన మైన ప్రాణి ఆహారంగా మారిపోవడం అడవి న్యాయంగా కొనసాగుతుంది.
A python attacked a baby crocodile, wrapped itself tightly around it, and made it its prey.🪱🪱🐊🐊
For the first time, I saw a python eating its prey like this—it sent chills down my spine.😌😌😱😱
Watch until the end… it might send chills down your spine too.😥😥😳 pic.twitter.com/HXQyKOvI8C
— Animal Arts 😻🇺🇸🇬🇧🇬🇧🇺🇸 (@MurariRaj20) July 5, 2026
