Tiger vs Duck Viral Video : పెద్దపులిని ఆటాడుకున్న బాతు..నవ్విస్తున్న వీడియో
అడవికి రారాజు లాంటి పెద్దపులిని ఓ చిన్న నీటి బాతు ఓ ఆట ఆడుకుంది. బాతు తెలివితేటల ముందు పులి అయోమయానికి గురైన ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను విపరీతంగా నవ్విస్తోంది.
విధాత : అడవికి రాజు వంటి పెద్దపులి అంటే వన్యప్రాణులతో పాటు మనుషులకు కూడా హడల్. అంతటి బలమైన మృగరాజును ఓ చిన్న నీటి బాతు ముప్పుతిప్పలు పెట్టి ఆటాడుకున్న వీడియో వైరల్ గా మారింది. ఓ నదిలో నీటిలో విహరిస్తున్న నీటి బాతు(బుడ బుంగ)ను చూసిన పెద్దపులి దానిని గుటకాయ స్వాహా చేయాలనుకుంది. అనుకున్నదే తడువుగా నీటిలోకి దిగి ఆ బాతు వద్దకు చేరుకుని దాన్ని నోటకరుచుకునే ప్రయత్నం చేసింది. ఇక్కడే అసలైన ట్విస్టు మొదలై పులి వేట..బాతు ఆటను చూసేవారికి నవ్వు తెప్పించింది.
తనను పట్టుకునేందుకు వచ్చిన పెద్దపులిని చూసిన నీటిబాతు వెంటనే అలర్ట్ అయ్యింది. పెద్దపులి తన సమీపానికి రాగానే బుడుంగుమని ఆ నీటి బాతు నీటిలో మునిగి మాయమైంది. అరే ఇదేందిరా.. మామా..నా ముందు ఇప్పుడే ఇక్కడే ఉన్న బాతు ఏమైందంటూ ఆ పులి గందరగోళంగా అటు ఇటు దాని జాడ కోసం వెతికింది. ఇంతలోనే ఆ బాతు పులి వెనుక నీటిలో తేలింది. దానిని చూసిన పులి అటువైపు తిరగగానే మళ్లీ బాతు నీటిలో మునిగి మాయమైంది. బాతు జాడను తెలుసుకోలేక…దానిని పట్టుకోలేక పులి నీటిలో అటుఇటు బేలా చూపులు చూస్తూ తీవ్ర అయోమయంతో పెట్టిన ఫేస్ చూసేవారికి నవ్వు తెప్పించింది. అల్ప ప్రాణియే కదా..ఈజీగా పట్టేసి తినేద్దామనునుకున్న పెద్దపులికి నీటి బాతు చుక్కలు చూపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అయ్యో..పాపం అంతపెద్ద మృగరాజుకు చిన్న నీటి బాతు ముందు ఎంతటి పరాభావం అంటూ..అందుకే అనువుగాని చోట అధికులం అనరాదంటూ కామెంట్లు చేశారు.
Duck outwits a tiger
— Science girl (@sciencegirl) December 22, 2025
ఇవి కూడా చదవండి :
Anasuya | ఆయన చెబితే వేసుకోవడం ఆపేస్తామా ఏంటి.. శివాజీకి దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చిన అనసూయ
Medaram : మేడారం జాతర నాటికి పనులు పూర్తి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram