Tribal Cultural Revival Explained | మేడారంలో ఆదివాసీ సాంస్కృతిక పునర్జీవనం

మేడారం జాతరలో చేపడుతున్న గ్రానైట్ నిర్మాణాలు, గద్దెల పునరుద్ధరణ, ప్రాకారం, రాతి కట్టడాల పై శిల్పులు చెక్కిన బొమ్మలు ఆదివాసీల సాంస్కృతిక పునర్జీవనానికి ప్రతీకగా అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా కోయల చారిత్రక పూర్వపరాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించే చిత్రాలను చెక్కుతున్నారు. ఆధ్యాత్మిక జీవన విధానానికి సంబంధించి చిహ్నాలతోపాటు కోయల జీవన విధానం, సమ్మక్క,సారలమ్మ, జంపన్న, పగిడిద్దరాజు, గోవిందరాజుల చరిత్ర, కోయల గోత్రాలు వారి చరిత్రకు సంబంధించి ఆనవాళ్ళు, మూలాలు ప్రతిబింబించే చిహ్నాలను చెక్కుతున్నారు.

Tribal Cultural Revival Explained | మేడారంలో ఆదివాసీ సాంస్కృతిక పునర్జీవనం
  • రాతి కట్టడాల పై కోయల చరిత్ర చిహ్నాలు
  • గద్దెల ప్రాంగణం లోపల అధ్యాత్మిక జీవనం
  • వెలుపలి రాతి కట్టడాలపై కోయల జీవనం

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

Tribal Cultural Revival Explained | మేడారంలో  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన మాస్టర్ ప్లాన్‌లో శాశ్వత నిర్మాణాలు చేపట్టడంతోపాటు ఆదివాసీల సాంస్కృతిక పునర్జీవనానికి వేదికగా తీర్చదిద్దుతోంది. ప్రతీ రెండేళ్ళకోసారి జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర సందర్భంగా వచ్చే లక్షలాది భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా వందల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు, వసతులు చేపట్టడం గత కొన్నేళ్ళుగా సాగుతోంది. ఈసారి మాత్రం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి భిన్నంగా మేడారంలో మాస్టర్ ప్లాన్ అమలుకు నిర్ణయం తీసుకున్నది. ఈ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా దాదాపు రూ. 250 కోట్ల వ్యయంతో శాశ్వత ప్రతిపదికన నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణంలో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ పనులను పూర్తిస్థాయిలో రాతి కట్టడాలు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు.

నాలుగు వేల టన్నుల గ్రానైట్ వినియోగం

మేడారం గద్దెల ప్రాంగణంలో చేపడుతున్న రాతి కట్టడాల కోసం నాలుగువేల టన్నుల గ్రానైట్ వినియోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఆళ్ళగడ్డ ప్రాంతంలోని ఈ ప్రత్యేక గ్రానైట్‌ను గద్దెల చుట్టూ రాతికట్టడం, ప్రాకారం, ప్రవేశ ద్వారాల నిర్మాణానికి వినియోగిస్తున్నారు. 500 సంవత్సరాలలో ఇలాంటి రాతి కట్టడం మరెక్కడా లేదంటున్నారు. చరిత్రలో ఒక మైలు రాయిగా నిలవనుంది. గద్దెల ప్రాంగణంలో చేపట్టిన నాలుగు వేల టన్నుల గ్రానైట్‌పై సమ్మక్క, సారలమ్మ తల్లుల చరిత్రను తెలియజేసే 7వేల బొమ్మలతో ప్రాంగణంలో  నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. టార్గెట్ వంద రోజుల లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. ఈ నెల 12వ తేదీలోపు పనులను పూర్తిచేసి ఈ నెల 20వ తేదీలోపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రాయచోటి నుంచి తెప్పించిన భారీ గ్రానైట్ రాళ్లను 600 కిలోమీటర్ల దూరంలోని మేదారానికి తరలించారు. వీటిని చెక్కేందుకు ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దాదాపు 450 మంది కళాకారులు నెలల తరబడి రేయింబవళ్లు శ్రమించారు. అన్నమయ్య జిల్లాకు చెందిన కళాకారులు పాల్గొన్నారు.

sammakka-saralamma-stone-work

ఆదివాసీ సాంస్కృతిక పునర్జీవనం

మేడారం జాతరలో చేపడుతున్న గ్రానైట్ నిర్మాణాలు, గద్దెల పునరుద్ధరణ, ప్రాకారం, రాతి కట్టడాల పై శిల్పులు చెక్కిన బొమ్మలు ఆదివాసీల సాంస్కృతిక పునర్జీవనానికి ప్రతీకగా అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా కోయల చారిత్రక పూర్వపరాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించే చిత్రాలను చెక్కుతున్నారు. ఆధ్యాత్మిక జీవన విధానానికి సంబంధించి చిహ్నాలతోపాటు కోయల జీవన విధానం, సమ్మక్క,సారలమ్మ, జంపన్న, పగిడిద్దరాజు, గోవిందరాజుల చరిత్ర, కోయల గోత్రాలు వారి చరిత్రకు సంబంధించి ఆనవాళ్ళు, మూలాలు ప్రతిబింబించే చిహ్నాలను చెక్కుతున్నారు.  దీంతో ఇప్పటి వరకు కేవలం కొద్ది మందికే పరిమితమైన ఆదివాసీల ఆధ్యాత్మిక విధానం, జీవన విధానానికి సంబంధించిన చరిత్ర చిహ్నాలు శాశ్వతంగా భద్రపరిచేందుకు అవకాశం లభించింది. భవిష్యత్ తరాలకు ఈ చరిత్ర చాటిచెప్పే విధంగా నిర్మాణాలు సాగుతున్నాయి. గ్రానైట్ నిర్మాణాలు, గద్దెల పునరుద్ధరణ, ప్రాకారం, ద్వారాలు, భారీ తోరణాలు, శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

sammakka-saralamma-stone-work

చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు శిల్పాలు ప్రతీకలు

గ్రానైట్ కట్టడాలపై సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు. కోయల ఇష్టదైవాలకు ప్రతిరూపంగా భావించే పులి, జింక, దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, మొసలి. పశుపక్ష్యాదులతో పాటు వారి జీవనశైలి, ఆచార సంప్రదాయాలకు, గొట్టు, గోత్రాలకు ప్రతిరూపంగా భావించే సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంక, బండి చక్రాలు, అడ్డ నిలువు గీతలు స్తంభాల పై చెక్కారు.

సమ్మక్క సారక్క వంశస్తులతోపాటు, 250 వంశాలకు చెందిన ఇంటి పేర్లు, మూలాలను శిలలపై చెక్కారు. తెల్లని గ్రానైట్ స్తంభాల ప్రధాన ద్వారం, ఆయా శిలలపై సమ్మక్మ సారక్క పూర్వీకులతో పాటు కోయల జీవనశైలిని తెలిపేలా శిల్పాలు చెక్కారు. 3,4,5,6,7 గొట్టుగోత్రాలను బొమ్మలు చెక్కారు.

sammakka-saralamma-stone-work

శిలలపై ఆదివాసీల జీవన విధానం, వారి దేవతల బొమ్మలు, ఇంకా 750 కోయ ఇంటి పేర్ల జీవన చిత్రాలను గీశారు. స్వాగత తోరణం పై 58 బొమ్మల్లో సమ్మక్క వంశీయుల మూలాలు,  పక్షులు, జంతువుల బొమ్మలున్నాయి. సమ్మక్కకు చెందిన రాయి బందానీ వంశంలోని 5వ గొట్టు ఒంటికొమ్ము దుప్పి, అడవి దున్న కొమ్ములు, ఆరు నెమలి ఈకలు చిత్రించారు.

మరో  ప్రధాన ద్వారం పై మూడో గొట్టు సారక్క వంశవృక్షంతో పాటు వడ్డే గోత్రం సిద్ద బోయిన, కొక్కెర వంశం వృక్షాన్ని తెలియజేస్తోంది. మూడు నిలువు, అడ్డం గీతలు, మూడో గొట్టు గోత్రం గురించి తెలిపే గుర్తులున్నాయి. త్రిభుజాలు పగిడిద్దరాజు సమ్మక్క నాగులమ్మల బిడ్డ సారలమ్మ రాజ్యం మూడో గొట్టుకు ప్రతీకగా నిలుస్తోంది.

చతురస్రం సగం ముక్కలు, ఎడమవైపు రెండో పిల్లర్ మీద ఇప్ప చెట్టు: మూడోగొట్టు పవిత్ర వృక్షంగా చెబుతున్నారు. మనిషి చేతిలో బాణం,ఉడుము: మూడో గొట్టువారు పూజించే జంతువు ఎనిమిది లతలు: ఎనిమిదో గొట్టు రాజ్యం గుర్తు, ఎక్స్ ఆకారం: ఎనిమిదోగొట్టు వడ్డె గోత్రంగుర్తుగా చెబుతున్నారు. సమ్మక్క తల్లిది 5వ గొట్టు, సారలమ్మది 3వ గొట్టు,  ఆదమరాజు వంశ వృక్షం, వడ్డే గోత్రం సిద్ధరబోయిన, కొక్కెర వంశ వృక్షం,  శివ గొట్టు నాగులమ్మ రాయి బందనీ వంశం, పగిడి ద్దరాజు, గోవిందరాజుల మూలాలకు ప్రతీకగా ఐదు నిలువు గీతలు ఐదవ గొట్టును తెలియజేస్తుంది.

ప్రాచీన అఖండ భారత భూభాగంలోని 18 దిక్కులను తెలియజేస్తుంది ఉత్తరభారతాన మూడో గొట్టు 36 రాజ్యాలను, దక్షిణాన ఆరో గొట్టు 18 రాజ్యాలు పాలించిన ట్లు కోయల చరిత్ర చెబుతున్నది. వీటితో పాటు నెలవంక, ఏనుగు, ఆరో గొట్లు బేరం వంశం వారి నుదుటి బొట్టును తెలియజేస్తోందన్నారు. మూడు అడ్డగీతలు మధ్యలో చుక్క, ఆదిశక్తి మళ్లీ సమ్మక్క రూపంలో అవతరించిందని కోయలు సమ్ముతారు.

పులి: సమ్మక్క తల్లి పులి రూపంలో ఉంటుందన్నది కోయల విశ్వాసం కోయత్వర్ ధర్మ చిహ్నం: కోయల ఇంటి పేర్లు, సంప్రదాయాలతో పాటు పశుపతి బేరంబోయిన రాజు ధర్మం దిశానిర్దేశంగా భావిస్తారు. తూతకొమ్ము కోయలు వేల్పు పండగ, చక్రం రంభ, నాగుపాము, ఐదు పలకల గుర్తు ఐదో గొట్టు రాజ్యం గుర్తుకు ప్రతీక, నాలుగు నిలువు గీతలు నాలుగో గొట్టును, కంకవనం ఐదో గొట్టు గోత్రం వృక్షం వెదురు చెట్లు,పక్షి పావురం, తెల్లగుర్రం, స్వస్తిక్: కోయ రాజ్యాలు పూర్వం వ్యాపారాలకు ప్రతీకగా నెమలిని సమ్మక్క తల్లి ప్రతిరూపంలో భావిస్తారు.

sammakka-saralamma-stone-work

మారేడు చెట్టును బందానీ వంశం పూజిత వృక్షంగా, 7వ గొట్టు గట్టు పారేడు వంశస్తులది. ఇది వారి సుదుటి బొట్టును తెలియజేస్తోంది. శివ లింగాలు, వెంకన్న నామాలు కూడా. గోవిందరాజుల ప్రధాన గడ్డలపై తిరుపతి వెంకన్న నామాలు, శంకు, స్వస్తిక్ వంటి చిత్రాలు ఉన్నాయి. ఎండి ముక్కు కొకాడి, పైడిముక్కు కోకాడి, ఎద్దు వన్డే గోత్రం మూగ గొట్టు సుదుటి బొట్లు, మూడు అడ్డ గీతలు మధ్యలో చుక్క, ఖడ్గమృగం నిలువు గీత నాల్గవ గోట్టు సనపగాని మతం నుదుటి బొట్టును తెలియజేస్తుంది. వీళ్ల గోత్ర జంతువు ఖడ్గమృగం, త్రిశూలం, ఒంటికొమ్ము దుప్పి, త్రిశూలం ఐదో గొట్టు రాయి బందానీ వంశం సుదుటి బొట్టును తెలియజేస్తుంది. వీళ్ల గోత్ర పూచిత జంతువు ఒంటికొమ్ముదుప్పిగా చెబుతున్నారు. మరుబోతు: సంవంకలో చుక్క ఏదో గొట్టు పాలేడుగట్టు వంశం నుదుటి బొట్టును తెలుపుతుంది. మనుబోతు, సింహం, సూర్య చంద్రులు, కల కోడి, కలక తామరపువ్వు బొమ్మలను చిత్రీకరించారు. ఒక్కో బొమ్మకు ఒక్కో అర్థం, ఆచారం, సంప్రదాయం ఉందని కోయల చరిత్రపై పరిశోధన చేసిన అర్కిటెక్చర్లు చెబుతున్నారు.

Read Also |

99 Rupees Goat | సంక్రాంతి బంపర్‌ ఆఫర్‌.. 99 రూపాయలకే 12 కిలోల మేకపోతు!
Pandugappa Fish : గోదావరిలో చిక్కిన పండుగప్ప చేప..భారీ ధరకు విక్రయం