శ్రీశ్రీ వర్థంతి నేడు

నిజంగా……మహాప్రస్థానమే !! దేళ్ళు పట్టిన “మహాకవి శ్రీశ్రీ కవితాసంపుటి “ ప్రచురణ !!మహాకవికి కూడా తప్పని “ప్రచురణ “ గండం ! విధాత:శ్రీశ్రీ గారు తన కవితాసంపుటికి “మహాప్రస్థానం “ అని పేరు పెట్టడం,దానికి తగ్గట్టే ఆ సంపుటి అచ్చయి పాఠకుల చేతికి రావడానికి పదేళ్ళకాలం పట్టింది.ఆధునిక తెలుగు సాహిత్యంలోఅద్భుత కవితా సంపుటిగా నిలిచిపోయిన మహాప్రస్థానం పుస్తకంగా రావడం వెనుక ఓ పెద్ద కథేవుంది. ఈరోజుల్లో మన పిల్లకవులు ఏడాదికి రెండు మూడు కవితా సంపుటాలు తెచ్చేస్తున్నారు.కానీశ్రీశ్రీ […]

శ్రీశ్రీ వర్థంతి నేడు

నిజంగా……మహాప్రస్థానమే !!

దేళ్ళు పట్టిన “మహాకవి శ్రీశ్రీ కవితాసంపుటి “ ప్రచురణ !!
మహాకవికి కూడా తప్పని “ప్రచురణ “ గండం !

విధాత:శ్రీశ్రీ గారు తన కవితాసంపుటికి “మహాప్రస్థానం “ అని పేరు పెట్టడం,దానికి తగ్గట్టే ఆ సంపుటి అచ్చయి పాఠకుల చేతికి రావడానికి పదేళ్ళకాలం పట్టింది.ఆధునిక తెలుగు సాహిత్యంలో
అద్భుత కవితా సంపుటిగా నిలిచిపోయిన మహాప్రస్థానం పుస్తకంగా రావడం వెనుక ఓ పెద్ద కథే
వుంది.

ఈరోజుల్లో మన పిల్లకవులు ఏడాదికి రెండు మూడు కవితా సంపుటాలు తెచ్చేస్తున్నారు.కానీ
శ్రీశ్రీ లాంటి మహాకవికి మాత్రం మహాప్రస్థానాన్ని అచ్చేయించుకోవడానికి నానాతంటాలు పడ్డాడు.
మహాప్రస్థానం కవితా ఖండికల రచన 1940 నాటికే పూర్తయింది.అప్పటికే ఇందులోని గీతాలు
పాపులర్ అయ్యాయి.జనం నోట్లో నానుతున్నాయి.ఇంత ప్రజాదరణ పొందిన మహాప్రస్థానం
గీతాలు అప్పుడే అచ్చుకావాలి.శ్రీశ్రీ కూడా మహాప్రస్థానాన్ని పుస్తక రూపంలో చూసుకోవాలని
ఉబలాటపడ్డాడు.కానీ..పరిస్థితులు కలిసిరాలేదు.సొంతంగా అచ్చేయించుకోడానికి శ్రీశ్రీ ఆర్థిక
పరిస్థితులు అనుకూలించ లేదు. అచ్చేసిపెట్టే వాళ్ళకోసం వెదికాడు.దొరకలేదు. దీంతో ….
మహాప్రస్థానగీతాలు పదేళ్ళపాటు పురిటి నొప్పులు పడుతూనే వున్నాయి.చివరకు 1950 లో
శ్రీశ్రీ మహాప్రస్థానం కల నిజమైంది.

మహాప్రస్థానంలో 40 కవితలుంటే, వాటిలో 14 కవితల్ని శ్రీ శ్రీ 1934 నాటికే రాశాడు.1933 లో
3 కవితలు, 1934 లో 11 కవితలు రాశాడు.మహాప్రస్థానంలో ముఖ్యమైన
“మరోఒప్రపంచం పిలిచింది “…
అనే గేయం కూడా ఇందులో వుంది.1936 లో మరో రెండు కవితలు జతయ్యాయి.
ఆతర్వాత శ్రీ శ్రీ కలం ముందుకు సాగలేదు.1937 దాకా గ్యాప్ వచ్చింది.ఈ కాలంలో శ్రీ శ్రీ రచన
లేం చేయలేదు.1937 ఏప్రిల్ లో “వ్యత్యాసం “, “అభ్యుదయం “ అనే రెండు కవితల్ని రాశాడు.
మే నెలలో “ప్రతిజ్ఞ “ రాశాడు.1938 నాటికి వీటి సంఖ్య 30కు చేరింది.1939లో మరో 4 కవితలు
రాశాడు.

ఇక సంపుటిలో చివరగా చేర్చాలనుకున్న “జగన్నాథ రధచక్రాలు “గేయాన్ని 1940 రాశాడు.
1940లో శ్రీ శ్రీ రాసిన గేయం ఇదొక్కటే.’ మరోప్రపంచం పిలిచింది’గేయాన్ని కేవలం అయిదంటే
అయిదు నిముషాల్లో రాసిన శ్రీ శ్రీ కి , ‘ జగన్నాథ రధచక్రాలు ‘ ముందుకు కదలడానికి బాగా
సమయం పట్టింది.ఓ పట్టాన ఈ గీతం మింగుడు పడలేదట.ఈ గేయాన్ని ప్రారంభించి, మూడ్
లేక మధ్యలోనే నిలిపేశాడు.ఎలాపడితే అలా, ఏదో ఒకటి రాయడానికి శ్రీ శ్రీ గారికి మనస్కరించ
లేదు.తాననుకున్న రీతిలో గేయం పరుగులుపెట్టే వరకు వేచి చూశాడు.ఎలాగైతేనేం చివరకు
జగన్నాథ రధచక్రాల గేయానికి మోక్షం కలిగింది.ఆకాశంలోని రధచక్రాలు శ్రీ శ్రీ రచనతో భూమార్గంపట్టాయి.

1940లోతనూహించిన విధంగానే ఈ గేయాన్ని పూర్తి చేశాడు.దీంతో మొత్తం 40 గీతాల
య్యాయి. వివిధ పత్రికల్లో ప్రచురింపబడిన ఈ గీతాలు “మహాప్రస్థానం “ పేరుతో సంకలనంగా
తేవాలని అప్పట్లో శ్రీ శ్రీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పుస్తకం వేయడానికి ఎవరూ …
ముందుకు రాలేదు.

విశ్వనాథ వారి నుంచి పిలుపు….!!

మహాప్రస్థానం అచ్చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆనోట ఈ నోట విన్న
మరోమహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు మహప్రస్థానాన్ని తాను ముద్రిస్తానని
ముందుకొచ్చారు.సాంప్రదాయికసాహిత్యాన్ని మాత్రమే ఇష్టపడే విశ్వనాథవారు ఇలా..
ముందుకు రావడం చాలామందికి ఆశ్చర్యం కలిగించిందట.అయితే శ్రీశ్రీ కవిత్వాన్ని అప్పటికే
విశ్వనాథవారు చదివి వున్నారు . శ్రీశ్రీ కవిత్వం ఇంకా పుస్తకంగా రాకపోవడేమిటి? అంటూ
ఆయన తన సన్నిహితులతో అన్నారట.(ఆరోజుల్లో కొందరు కవులే ముద్రాపకులుగా ఇతర
కవుల పుస్తకాలను అచ్చేససాంప్రదాయం వుండేది.ఉదాహరణకు ఆరుద్ర త్వమేవాహమ్ ను
ఆవంత్స సోమసుందర్ తన కళాకేళీ ప్రచురణల తరపున ముద్రించారు).

విశ్వనాథ వారి చొరవతో మహాప్రస్థానం ముద్రణకు మార్గం సుగమమైంది.1940లో చలం,
జలసూత్రంరుక్మిణినాధ శాస్త్రి గారు పుస్తకానికి ఉపోద్ఘాతం కుడా రాసేశారు. ముద్రణకు అన్నీ
సిద్ధమయ్యాయి.ఇక‌పుస్తకం వచ్చేస్తుందిలే అనుకుంటుండగానే ఎందుకనో విశ్వనాథ వారు
వెనకడుగు వేశారు. దాంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది.మహాప్రస్థానం ముద్రణకు బ్రేకులు
పడ్డాయి. చూస్తూ చూస్తూ వుండగనే ఏడేళ్ళు గడిచిపోయాయి
1947 వచ్చింది.భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడానికి రంగం సిద్ధమైంది.శ్రీశ్రీ గారు గతంలో
మొదలు పెట్టి,మధ్యలో ఆపేసిన “ చూడు చూడు నీడలు “ గేయాన్ని పూర్తి చేయాల్సిందిగా
ఆరుద్ర ఒత్తిడి చేశారు. 1947 జూన్ 19వ తేదీన శ్రీశ్రీ ‘నీడలు ‘ గేయాన్ని పూర్తి చేశాడు.దీంతో
మహాప్రస్థానం గేయాల సంఖ్య 40 కు చేరింది.అప్పటినుంచి మరో మూడేళ్ళ తర్వాత అంటే…
1950 ,జూన్ లో “మహాప్రస్థానం “ అచ్చయ్యింది.ముద్రాపకుడు మచిలీపట్నంకు చెందిన‌ నళినీ
కుమార్ . ఈయన శ్రీశ్రీ మిత్రుడు కూడా.తొలి ముద్రణ కాపీలు హాట్ కేక్ లా అమ్ముడుపోయాయి.
వెను వెంటనే ద్వితీయ,తృతీయ,చతుర్థ,…ఇలా ముద్రణల మీద ముద్రణలు జరిగిపోయాయి.
కవిత్వవిభాగంలో అత్యధిక కాపీలను అమ్మిన పుస్తకంగా మహాప్రస్థానం చరిత్ర సృష్టించింది.
ద్వితీయముద్రణ మొదలు కొని సుమారు30 దాకా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారే ముద్రించారు.
అయితే జూన్ 1999నాటిముద్రణ మాత్రం విరసం పక్షాన ముద్రించారు.వున్నాయి.( వివిధ
ముద్రణల వివరాలు 1954.ఫిబ్రవరి ,జులై 1954,జనవరి 1956, ఫిబ్ర.,58,సెప్టెం.59,ఆగస్ట్
1961,ఏప్రిల్ 62,డిసెం.63మార్చి 65, సెప్టె.67,జూన్ 69, ఫిబ్ర 70,అక్టో 73,నవం.75,జూన్
81మార్చి 84,జూన్,87,ఆగస్ట్ 88,మార్చి 91,జులై 93,నవంబర్ 94,జూన్ 99 విరసం అక్టో
2001,జులై 2003,26వ ముద్రణ జులై 2004.).ఇలా అనేక ముద్రణలతో మహాప్రస్థానం
కొత్త రికార్డు నెలకొల్పింది.

కాగా లండన్ నగరంలోని విదేశాంధ్ర ప్రచురణం నిమిత్తం మహాప్రస్థానం గీతాలను శ్రీశ్రీ కంఠ ధ్వని
తో రికార్డు చేసి,క్యా‌సెట్స్ ను విడుదల చేశారు.( సినారె కంఠ ధ్వనితో ఆయన తెలుగు గజల్స్
క్యాసెట్స్ గా వచ్చాయి.)

కేవలం పుస్తకాల అమ్మకాల్లోనే గాక విషయపరంగా కూడా మహాప్రస్థానం తెలుగు సాహితీ లోకంలో
సంచలనం సృష్టించింది.1950లో మహాప్రస్థానం అచ్చయి,మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాక
గల్లీకో పిల్ల శ్రీశ్రీ వెలిశాడు.శ్రీశ్రీ రచనలతో సాహితీ లోకం ఉత్తేజితమైంది.మహాప్రస్థానం గీతాలు
తెలుగు సాహిత్య చరిత్రలో కలికి తురాయి లా నిలిచిపోయాయి.అప్పటి ఇప్పటి వరకు శ్రీశ్రీ
ప్రభావం పడని తెలుగు కవులు బహు అరుదు.

“అనితర సాధ్యం నా మార్గమని “,శ్రీ శ్రీ అన్నమాటలు అక్షరాలా నిజం చేసి చూపించింది మహా
ప్రస్థానం.” మళ్ళీ ఇటువంటి గీతాల్ని రాయడం నావల్ల కాకపోవచ్చు “అని శ్రీ శ్రీ అన్నట్లుగానే,
ఆతర్వాత వచ్చిన శ్రీశ్రీ రచనలు మహాప్రస్థానం ముందు వెలవెలబోయాయి.

మహాప్రస్థానాన్ని శ్రీశ్రీ తన మిత్రుడు జనార్దనరావు కు అంకితం ఇచ్చారు.తలవొంచుకు వెళి
పోయావా? నేస్తం “అంటూ జనార్దన రావు మృతికి ఎలిజీగా రాసిన గేయం ఓ మాస్టర్ పీస్.
ఇక మహాప్రస్తానానికి చలం గారి యోగ్యతాపత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే.విచిత్రం
ఏమంటే లండన్ ప్రచురణలో “చలం గారి యోగ్యతా పత్రం “ ,లేకపోవడం.అలా లేక పోవడం
లోపమేం కాదని శ్రీశ్రీ కూడా భావించడం ఇంకా విచిత్రం.అయితే చలంగారి రచన వున్నా
లేకున్నా దాని విశిష్టమైన విలువ దానికుండనే వుందని శ్రీశ్రీ గారు ,”ఐ వాష్” మాటలు
చెప్పడం మహా విచిత్రం.

మహాప్రస్థానంపై శ్రీశ్రీ….!!

“మహాప్రస్థానంలో నేను చేసిందంతా సామాజిక రుగ్మతను నిదానించడం మాత్రమే.
‘ఇదీ మన ప్రపంచం ! ఇలా వున్నారు.ఇచ్చటి ప్రజలు.” అన్నాన్నేను.ఇది సరైన రోగ
నిదానమే కానీ,ఇంతటితో ఆగిపోకూడదు.జబ్బులకు తగ్గ మందులు వెదకాలి.పైపై
పూతలతో ఈ జబ్బులు కుదరవు.కావల్సింది శస్త్ర చికిత్స.దాన్నే “విప్లవం “అంటున్నాన్నేను.

మహాప్రస్థానంలో అభ్యుదయ కవిత్వమూ,విప్లవ బీజాలూ వున్నాయి.విప్లవ సాహిత్యం
లేదు.విప్లవ సాహిత్యం అంటే ఏమిటి? సామాన్య ప్రజానీకాన్ని విప్లవాచరణకుద్యుక్తుల్ని
చేస విధంగా సాగేదే “!!