నేడు అంతర్జాతీయ… స్నేహితుల దినోత్సవం

విధాత:ప్రతి ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్‌షిప్‌ డేగా ప్రకటన 1935లో ప్రకటించిన యునైటెడ్‌ స్టేట్స్‌ కాంగ్రెస్‌ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు స్నేహితులకు అంకితం నాటి నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం. ఫ్రెండ్‌షిప్‌ డేను ఘనంగా జరుపుకుంటున్న ప్రపంచ దేశాలు *"స్నేహానికి ఇంతకంటే గొప్ప నిర్వచనం ఏముంటుంది. గాడాంధకారం అలుముకున్నప్పుడు నిరాశా నిస్పృహలు చుట్టుముట్టినపుడు..నీ కోసం నేనున్నానంటూ తట్టే ఆత్మీయ స్పర్శే స్నేహం.  స్నేహం నిత్యనూతనం,నిత్య పరిమళం.ఎలాంటి అరమరికలు లేకుండా సంతోషాన్నయినా,విషాదాన్నయినా పంచుకునేది స్నేహితుల దగ్గరే.అందుకే అంటాడు వివేకానందుడు…'శత్రువు […]

నేడు అంతర్జాతీయ… స్నేహితుల దినోత్సవం

విధాత:ప్రతి ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్‌షిప్‌ డేగా ప్రకటన 1935లో ప్రకటించిన యునైటెడ్‌ స్టేట్స్‌ కాంగ్రెస్‌ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు స్నేహితులకు అంకితం నాటి నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం.

ఫ్రెండ్‌షిప్‌ డేను ఘనంగా జరుపుకుంటున్న ప్రపంచ దేశాలు

*”స్నేహానికి ఇంతకంటే గొప్ప నిర్వచనం ఏముంటుంది. గాడాంధకారం అలుముకున్నప్పుడు నిరాశా నిస్పృహలు చుట్టుముట్టినపుడు..
నీ కోసం నేనున్నానంటూ తట్టే ఆత్మీయ స్పర్శే స్నేహం.
స్నేహం నిత్యనూతనం,
నిత్య పరిమళం.
ఎలాంటి అరమరికలు లేకుండా సంతోషాన్నయినా,
విషాదాన్నయినా పంచుకునేది స్నేహితుల దగ్గరే.
అందుకే అంటాడు వివేకానందుడు…
‘శత్రువు ఒక్కడైనా ఎక్కువే… స్నేహితులు వందమంది అయినా తక్కువే’ అని.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోయి, మనిషన్నవాడు మాయమైపోతున్న తరుణంలోనూ ఇంకా ఆత్మీయమైన స్నేహాలు,ఉన్నతమైన మానవతా విలువలు వెలుగు రేఖలుగా దారి చూపుతూనే వున్నాయి. స్నేహమంటే ఒక నులివెచ్చటి స్పర్శ.

“అలాంటి స్నేహానికి ప్రత్యేకంగా
ఒక రోజు అవసరమా…
అంటే *అవసరమేనంటూ
ప్రపంచ వ్యాప్తంగా ఒక రోజును నిర్ణయించుకొని స్నేహితుల దినోత్సవాన్ని ఒక వేడుకలా జరుపుకుంటున్నారు.”

స్నేహితుల దినోత్సవం
సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు