నీటిలోనే ఆ బాలుడి మనుగడ..వింత ప్రవర్తన

పశ్చిమ బెంగాల్‌కు చెందిన 16 ఏళ్ల ఇక్బాల్ షేక్ శరీరంలో మంట కారణంగా వారంలో నాలుగైదు రోజులు చెరువులోనే గడుపుతున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స ఫలించకపోవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Aug 10, 2026, 4:52 pm IST
Read Time: 3 mins
నీటిలోనే ఆ బాలుడి మనుగడ..వింత ప్రవర్తన

నీటిలో గంట పాటు గడపడమే మహా ఎక్కువ అనుకునే మనుషులకు భిన్నంగా పశ్చిమ బెంగాల్‌లోని ఓ బాలుడు మాత్రం రోజుల తరబడి నీటిలోనే గడుపుతుండటం ఆశ్చర్యం రేపుతుంది. ముర్షిదాబాద్‌కు చెందిన 16 ఏళ్ల ఇక్బాల్ షేక్ వారంలో ఏకంగా నాలుగైదు రోజులు నీటిలోనే గడుపుతున్నాడు. ఒక్కోసారి ఏడు రోజులపాటు రాత్రిపగలూ చెరువులో ఉంటున్నాడు. అతడి వింత ప్రవర్తన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

శరీరంలో తీవ్రమైన మంటగా ఉండటం వల్ల రోజంతా చెరువు నీటిలోనే గడుపుతున్నానని ఇక్బాల్ షేక్ చెబుతున్నాడు. నీటిలో ఉంటేనే ఉపశమనం కలుగుతుందని, బయటకు రాగానే మంట వస్తుందని అతడు చెబుతున్నాడు. రోజుల తరబడి నీటిలో ఉండటం వల్ల చర్మవ్యాధుల బారిన పడుతున్నాడు. జలుబు, దగ్గు వంటి ఇన్ఫెన్షన్ల బారిన పడుతున్నాడు. నీటిలో ఉన్నప్పుడు అతని వద్దకే ఆహారాన్ని అందిస్తున్నారు. తనను బాధిస్తున చర్మ వ్యాధి మంటలకు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకున్నా.. ఫలితం లేకపోయిందని, ప్రైవేటులో చికిత్స చేయించుకునే స్థోమత లేదని ఇక్బాల్‌ కుటుంబసభ్యులు వాపోతున్నారు.