Andhra Pradesh | అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. 15 మంది పర్యాటకులు మృతి
Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రయివేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోగా, 15 మంది పర్యాటకులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్దారు.
Andhra Pradesh | అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రయివేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోగా, 15 మంది పర్యాటకులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్దారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
చిత్తూరు జిల్లాకు చెందిన కొంత మంది పర్యాటకులు ఓ ప్రయివేటు బస్సులో టూర్‌కు వెళ్లారు. భద్రాచలం ఆలయ దర్శనం అనంతరం అన్నవరం బయల్దేరారు. అల్లూరి జిల్లాలోని చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రోడ్డు రాజుగారిమెట్ట వద్దకు రాగానే పర్యాటకుల బస్సు అదుపుతప్పింది. లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న చింతూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాద ఘటనలో 15 మంది వరకు యాత్రికులు చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. మృతుల బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 35 మంది ప్రయాణికులు సహా మొత్తము 37 మంది ఉన్నారు. ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. విఘ్నేశ్వర ట్రావెల్స్ కు చెందినది. ప్రమాదంతో చింతూరు మారేడుమిల్లి మధ్య ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదం జరిగిన బస్సు నెంబర్ ఏపీ 39 యు ఎం 6543.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram