Maoist Surrender To AP DGP | మావోయిస్టు దంపతుల లొంగుబాటు
మావోయిస్టులు శనివారం ఉదయం ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట లొంగిపోయారు.

Maoist Surrender To AP DGP | ఏపీకి చెందిన పలువురు మావోయిస్టులు శనివారం ఉదయం ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట లొంగిపోయారు. వారి వివరాలను డీజీపీ మీడియాకు వివరించారు. లొంగిపోయిన వారిలో రామకృష్ణ(కమలేష్), అరుణ ఉన్నారని పేర్కొన్నారు. వారు 30ఏండ్లుగా పార్టీలో కొనసాగుతూ..కొంతకాలంగా చత్తీస్ గఢ్ లో పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి ఛత్తీస్‌గఢ్‌లో రూ. 25 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 20 లక్షలు రివార్డు ప్రకటించారు. ఆయన భార్య అరుణకు రూ. 5 లక్షల రివార్డు ప్రకటించారు. తాజాగా ఏవోబీ పరిధిలో మావోయిస్టుల భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ తెలిపారు. ఏకే 47, హ్యాండ్ గ్రనేడ్లు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయన్నారు.
మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుకుని జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో పనిచేస్తున్నరాష్ట్రానికి చెందిన దాదాపు 21 మంది మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి వచ్చి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.