40 Tonnes Whale Washed Ashore In Anakapalli | అనకాపల్లి తీరంలో తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం
ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలం, పెద్దతినార్ల సముద్ర తీరానికి సుమారు 40 టన్నుల బరువు, 25 అడుగుల పొడవు గల భారీ తిమింగలం (Whale) కళేబరం కొట్టుకొచ్చింది.

అమరావతి : ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పెద్దతినార్ల గ్రామ సముద్ర తీరానికి ఓ భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. నక్కపల్లి, పెద్దరాజయ్యపేట గ్రామాల మధ్య ఉన్న సముద్ర తీరం వెంబడి కొందరు యువకులు చేపల వేటకు వెళ్లగా…సముద్రపు అలలకు తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలం కళెబరాన్ని గమనించారు.
40 టన్నుల బరువు గల ఈ భారీ తిమింగలం సుమారు 25అడుగుల పొడవు..10అడుగుల వెడల్పుతో ఉంది. స్థానికులు ఈ భారీ తిమింగలాన్ని ఆసక్తిగా తిలకించారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి (మ)
పెద్దతినార్ల గ్రామ సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన 40 టన్నుల బరువు గల భారీ తిమింగలం. సుమారు 100 అడుగులు ఉంటుందని అంచనా.#AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #AndhraNews #VizagNews pic.twitter.com/TKsh4RYcM5— Vizag News Man (@VizagNewsman) October 20, 2025