కరోనాతో ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న టీటీడీ ఉద్యోగులకు 5లక్షలు అడ్వాన్స్ గా ఇవ్వాలి.
రోనాతో వివిధ ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న టీటీడీ ఉద్యోగులకు టీటీడీ పాలకమండలి తీర్మానం అనుసరించి 5లక్షల వరకు చికిత్స నిమిత్తం అడ్వాన్స్ గా హాస్పిటల్లో చేరిన వెంటనే ఇప్పించుట గురించి అభ్యర్థన:- సూచిక:-టీటీడీ పాలకమండలి తీర్మానం నెంబర్388 -తేది27-02-2021 కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులు అనేకమంది కరోనా పాజిటివ్ వచ్చి టీటీడీ క్వారంటైన్ సెంటర్లలో ఆశ్రయం పొందుతున్నారు.ఇంకొంత మంది కరోనా తీవ్రత ఎక్కువై ప్రాణాపాయ స్థితిలో వివిధ ప్రాంతాల్లోని ప్రయివేటు […]

రోనాతో వివిధ ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న టీటీడీ ఉద్యోగులకు టీటీడీ పాలకమండలి తీర్మానం అనుసరించి 5లక్షల వరకు చికిత్స నిమిత్తం అడ్వాన్స్ గా హాస్పిటల్లో చేరిన వెంటనే ఇప్పించుట గురించి అభ్యర్థన:-
సూచిక:-టీటీడీ పాలకమండలి తీర్మానం నెంబర్388 -తేది27-02-2021
కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులు అనేకమంది కరోనా పాజిటివ్ వచ్చి టీటీడీ క్వారంటైన్ సెంటర్లలో ఆశ్రయం పొందుతున్నారు.ఇంకొంత మంది కరోనా తీవ్రత ఎక్కువై ప్రాణాపాయ స్థితిలో వివిధ ప్రాంతాల్లోని ప్రయివేటు ఆసుపత్రులనందు చికిత్స పొందుతూ ఇప్పటికే 12మంది దాకా మరణించారు.
వీరందరూ ప్రాణాలను కాపాడుకోవాలనే ఏకైక లక్ష్యంతో అప్పులు చేద్దాం అన్నా ఇచ్చే వారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం మా దృష్టికొచ్చింది. ఇంకొంత మంది అధిక వడ్డీలకు అప్పో సప్పో చేసి ఆసుపత్రులకు చెల్లించడము జరుగుతున్నది.
ఇప్పటికి ఇంకా కొంతమంది ఉద్యోగులు చికిత్సలోఉన్నారు.
ఆసుపత్రుల బిల్లులు చెల్లించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
కావున కామoదులవారు దయయుంచి ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి టీటీడీ
పాలక మండలి నిర్ణయించిన మేరకు 5లక్షల వరకు అడ్వాన్స్ ఇచ్చి ఆకుటుంబాలకు అండగా నిలవాలని టీటీడీ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు
మల్లారపు నాగార్జున కోరారు.