All India OBC Jack | ఐక్య ఉద్యమంతో బి.సి హక్కుల సాధన … ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్

దేశాన్ని ఏలుతున్న పాలకులు బి.సి లను పనివాళ్ళుగా, ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ విమర్శించారు.

All India OBC Jack | ఐక్య ఉద్యమంతో బి.సి హక్కుల సాధన … ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్

చట్టసభల్లో వాటా కోసం దేశ వ్యాప్త ఉద్యమం

విధాత:దేశాన్ని ఏలుతున్న పాలకులు బి.సి లను పనివాళ్ళుగా, ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ విమర్శించారు. తరతరాలుగా ఉత్పత్తి, శ్రమ చేస్తూ ప్రతి పనిలో బి.సి లు కీలకపాత్ర పోషిస్తున్నప్పటికి అభివృద్ధిలో మాత్రం ఆమడ దూరంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆంధ్రప్రదేశ్ అమరావతిలో జరిగిన జాతీయ బి.సి చైతన్య సమితి రాష్ట్ర స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

దేశాన్ని పాలిస్తున్న బ్రాహ్మణీయ ఆధిపత్య పాలక పార్టీలు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడుతూ బి.సి లకు తీరని అన్యాయం చేస్తున్నారని వారు విమర్శించారు. తెలంగాణలో సమగ్ర కుల జనగణన చేసి స్థానిక సంస్థల్లో బి.సి లకు 43 శాతం రిజర్వేషన్లు కల్పించి అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ చెప్పిందన్నారు. కామారెడ్డి బి.సి. డిక్లరేషన్ లో వాగ్దానం చేసి, మ్యానిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ఆ విషయాల ఊసెత్తకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడం చాలా ద్రోహమని వారు అన్నారు.

జాతీయ బి.సి చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రమణ మాట్లాడుతూ బి.సి ల పునాధితోనే నిర్మితమైన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు బి.సి లకు రాజకీయ పదవులు ఇవ్వకపోవడం మోసమని అన్నారు. మోడీ బిసి లను హిందువుల పేరున ఓటు బ్యాంకు గా వాడుకుంటున్నదని, ప్రదాని మోడీ బి.సి అయి ఉండి కూడా బి.సి కుల జనగణన చేయడం లేదని, బి.సి ల అభివృద్ధికి బడ్జెట్ లో కేటాయింపులు లేకపోవడం సిగ్గు చేటన్నారు.

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఒబిసి జాక్ వైస్ చైర్మన్ వెలుగు వనిత, జాతీయ సభ్యుడు చాపర్తి కుమార్ గౌడ్గే, జాతీయ బి.సి చైతన్య సమితి ప్రధాన కార్యదర్శి కోల ఏడుకొండలు, రాష్ట్ర యువజన అద్యక్షులు దుప్పుల శివాజీ, తేనె నాగేశ్వర్ రావు, గొడుగు శంకర్, వెంకటయ్య, మోక రవి, సహజీవన్, రాజ్ కమల్, సందే మాధవరావు, నరసింహ రాజు, వెలుగు యామిని తదితరులు పాల్గొనగా కళాకారులు బుల్లెట్ వెంకన్న, చంద్రకళ, నరసింహసామి పాల్గొన్నారు.