అమరావతి మహా పాదయాత్ర ప్రారంభం
ఉన్నమాట: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ జరగుతున్న ఉద్యమానికి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా రైతులు, వివిధ వర్గాల ప్రతినిధులు చేపట్టిన మహా పాదయాత్ర కాసేపటి క్రితం ఘనంగా మొదలైంది. వెంకటపాలెంలోని వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రైతులు అనంతరం ఆలయం బయట ఉన్న వేంకటేశ్వరస్వామి వారి రథాన్ని నడిపి పాదయాత్రకు అంకురార్పణ చేశారు. అనంతరం రథాన్ని గ్రామంలోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అమరావతి పరిరక్షణ సమితి రైతు […]
ఉన్నమాట: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ జరగుతున్న ఉద్యమానికి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా రైతులు, వివిధ వర్గాల ప్రతినిధులు చేపట్టిన మహా పాదయాత్ర కాసేపటి క్రితం ఘనంగా మొదలైంది.

వెంకటపాలెంలోని వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రైతులు అనంతరం ఆలయం బయట ఉన్న వేంకటేశ్వరస్వామి వారి రథాన్ని నడిపి పాదయాత్రకు అంకురార్పణ చేశారు. అనంతరం రథాన్ని గ్రామంలోకి తీసుకెళ్లారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అమరావతి పరిరక్షణ సమితి రైతు జేఏసీ నేతలు పాల్గొన్నారు. వెంకటపాలెంలో ప్రారంభమైన రైతుల మహాపాదయాత్ర 1000 కిలోమీటర్లు సాగి నవంబరు 11న శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయానికి చేరుకుంటుంది.

వాస్తవానికి దాదాపు ఏడాది కిందట అమరావతి నుంచి తిరుపతి వరకు చేసిన మొదటివిడత పాదయాత్ర చేపట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకే… అమరావతిలో రాజధాని నిర్మించాలంటూ హైకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram