విద్యుత్తు శాఖ నిర్వాకంతో అన్నదాత కష్టాలు
వరి నారు ఎండిపోయింది..నాటు వేయలేదు..కృష్ణమ్మ చెంతనే ఉన్నా.. ఏం ప్రయోజనం.. విధాత:కృష్ణమ్మ చెంతనే వెల్లుతుంది.లక్షల క్యూసెక్ ల నీరు వెల్లుతున్నా అన్నదాత ఆ నీటిని ఒడిసిపట్టాలంటే విద్యుత్ కావాలి. ఆ విద్యుత్ ను ఆ శాఖ అధికారులు సక్రమంగా ఇవ్వలేకపోవడంతో అన్నదాత సాగును వదిలేశాడు.సాగు నీరు రాక,లేక నారు ట్రాక్టర్ లోనే ఎండిపోయింది..అన్నదాత కంట కన్నీరే మిగిలింది….ఇది కృష్ణాజిల్లా పెనమలూరు మండలం చోడవరం.ప్రకాశం బ్యారేజ్ కు 10 కిమీ దూరం.కృష్ణానది కి కూతవేటు దూరం.అదీ నదీ పరీవాహక […]

వరి నారు ఎండిపోయింది..
నాటు వేయలేదు..
కృష్ణమ్మ చెంతనే ఉన్నా.. ఏం ప్రయోజనం..
విధాత:కృష్ణమ్మ చెంతనే వెల్లుతుంది.లక్షల క్యూసెక్ ల నీరు వెల్లుతున్నా అన్నదాత ఆ నీటిని ఒడిసిపట్టాలంటే విద్యుత్ కావాలి. ఆ విద్యుత్ ను ఆ శాఖ అధికారులు సక్రమంగా ఇవ్వలేకపోవడంతో అన్నదాత సాగును వదిలేశాడు.సాగు నీరు రాక,లేక నారు ట్రాక్టర్ లోనే ఎండిపోయింది..అన్నదాత కంట కన్నీరే మిగిలింది….ఇది కృష్ణాజిల్లా పెనమలూరు మండలం చోడవరం.ప్రకాశం బ్యారేజ్ కు 10 కిమీ దూరం.కృష్ణానది కి కూతవేటు దూరం.అదీ నదీ పరీవాహక ప్రాంత.అంటే ఇక్కడ నీరు లేదు,దొరకదు అంటే ఎవ్వరికీ నమ్మశక్యం కాదు.కానీ పరిస్థితి ఇక్కడ చాలా భిన్నంగా ఉంది.పేరు కు వాణిజ్య పంటలు పండే ప్రాంతం అయినా వరి నారు తీసుకొచ్చిన ట్రాక్టర్ ట్రక్కులోనే ఎండిపోవడం చూడాల్సి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు కూడా.కానీ చోడవరంలో అన్నదాతలను,వ్యవసాయం విలువ తెలిసిన ఎవ్వరైనా ఈ దృశ్యాలు చూస్తే గుండె ద్రవించాల్సిందే.ఇదేమిటీ అంటే చోడవరం విద్యుత్తు శాఖ నిర్లక్ష్యం పుణ్యామా అని జగదీష్ అనే రైతు ఆవేదన అంతా ఇంతా కాదు. ఐదు ఎకరాలు వ్యవసాయం చేసేందుకు కవుల కు తీసుకున్నాడు.అదే అతను చేసుకొన్న పాపామేమో.నదీతీరంలో వ్యవసాయ భూమి సాగు చేయాలి అంటే విద్యుత్తు బోర్లపై ఆధారపడాల్సిందే. విద్యుత్తు బోరు కరెంట్ లేక పనిచేయకపోతే అన్నదాత నష్టపోవాల్సిందే.ఇక్కడ అదే జరిగింది.మద్దూరు నుంచి వచ్చే విద్యుత్తు ఫీడర్ రైతులు కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ ఇటీవల వరదల సమయంలో పనిచేయలేదు.
స్థానిక రైతులు విద్యుత్తు శాఖ అధికారులకు మొరపెట్టుకున్నారు.అప్పటికే గ్రామంలో వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ లు చూసే సిబ్బంది సెలవులో ఉన్నారు. తీరా విద్యుత్తు శాఖ ఎస్.సి దృష్టి కి గ్రామ రైతులు,సర్పంచ్ కూడా సమస్యను తీసుకెళ్లారు.అధికారులు స్పందించి వెంటనే ట్రాస్పార్మర్ మరమ్మత్తులు చేస్తారని భావించిన జగదీశ్ నారు సిద్ధం చేసుకొని పొలం వద్దకు తీసుకొచ్చి నాటు వేయడానికి సిద్ధమయ్యాడు.కానీ ఎంతో సిపార్సులతో గాని ట్రాస్పార్మర్ మార్చారు.అయినా ప్రయోజనం లేకపోయింది.మద్దూరు విద్యుత్తు ట్రాస్ఫార్మర్ పై లోడ్ కు మించి ఎడాపెడా విద్యుత్తు కనెక్షన్ లు ఇవ్వడంతో కొత్త ట్రాస్ఫార్మర్ వేసినా ప్రయోజనం లేదు.మద్దూరు పీడర్ పై 150 శాతం అధిక లోడ్ ఉంది. ప్రక్కనే గంగురు ఫీడర్ మీద లోడ్ కేవలం 50 శాతం మాత్రమే లోడ్ ఉన్నప్పటికీ వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ లు మార్చే అవకాశం ఉన్నా మార్చకుండా విద్యుత్తు అధికారులు తాత్సారం చేయడంతో రైతు జగదీష్ తెచ్చిన నారు ట్రక్ లోనే ఎండిపోయింది.జగదీష్ ఈ సమస్యపై కలెక్టర్ దృష్టికి కూడా ఫోన్ లో తీసుకెళ్లాడు.నేటికీ విద్యుత్తు అధికారులు రేపు,మాపు అని చేస్తున్న జాప్యంతో జగదీష్ నాటు వేయలేదు.వేల రూపాయలతో కొనుగోలు చేసి తెచ్చిన నారు ఎండిపోవడంతో చేసేది లేక దుక్కి దున్నిన పొలాన్ని వదిలేసి కన్నీటి పర్యంతం అవుతున్నాడు.మద్దూరు ఫీడర్ కష్టాలు జగదీష్ నోటి నుంచి వింటుంటే అక్కడ రైతులు పదే కష్టాలు ఏమిటో అర్థం అవుతాయి.