AP | 31న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల భేటీ

టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లు ఈ నెల 31న భేటీ కాబోతున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

AP | 31న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల భేటీ

పోలింగ్‌..కౌంటింగ్‌లపై చర్చ

విధాత : టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లు ఈ నెల 31న భేటీ కాబోతున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బుధవారం విదేశీ పర్యటన ముగించుకుని చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు.

గురువారం రాత్రి అమరావతికి చేరుకుంటారు. 31న పవన్ కల్యాణ్‌తో పాటు బీజేపీ నేతలతో చంద్రబాబు సమావేశమవుతారని తెలుస్తుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సన ఎన్నికల పోలింగ్ జరిగిన తీరు, అనంతర పరిణామాలపై వారు ఈ భేటీలో సమీక్షించనున్నారు. అలాగే ఈనెల 4న జరిగే ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించనున్నారు.