ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎస్, డీజీపీ.. ఎన్నికల హింసపై సీఈసీకి వివరణ
ఏపీలో ఎన్నికల హింసకు సంబంధించి స్వయంగా వివరణ ఇవ్వాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఢిల్లీ చేరుకున్నారు
విధాత : ఏపీలో ఎన్నికల హింసకు సంబంధించి స్వయంగా వివరణ ఇవ్వాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్నం 3.30గంటలకు వారు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలవనున్నారు. ఏపీలో ఎన్నికల సందర్భంగా తలెత్తిన హింసాత్మక ఘటనలు పోలింగ్ తర్వాత కూడా కొనసాగడంపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ శాఖ వైఫల్యాన్ని తప్పుబట్టింది. హింసాత్మక సంఘటలనపై స్వయంగా ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని సీఎస్, డీజీపీలకు సమన్లు జారీ చేసింది. దీంతో వారిద్దరు ఢిల్లీకి చేరుకున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram