ఇక ఏపీలో ‘ప్రాజెక్ట్‌ పునర్విక’: మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

అరుదైన జన్యు వ్యాధులతో బాధపడే పిల్లల కోసం ఏపీ ప్రభుత్వం ‘ప్రాజెక్ట్‌ పునర్విక’ స్కీమ్ ను ప్రకటించింది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ ప్రకటన చేశారు.

Reported by: Y.V. Narsimha Reddy | ఆంధ్ర ప్రదేశ్ | Apr 19, 2026, 3:10 pm IST
Read Time: 2 mins
ఇక ఏపీలో ‘ప్రాజెక్ట్‌ పునర్విక’: మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

అమరావతి : అరుదైన జన్యు వ్యాధులతో బాధపడే పిల్లల కోసం ఏపీ ప్రభుత్వం ‘ప్రాజెక్ట్‌ పునర్విక’ స్కీమ్ ను ప్రకటించింది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ ప్రకటన చేశారు. స్పైనల్‌ మస్క్యులర్ అట్రోపీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను మంత్రి నారా లోకేశ్‌ విదేశాల నుంచి తెప్పించి ఆమె ప్రాణాలు కాపాడిన విషయం తెలిసిందే.

ఈ ఘటనతో ప్రేరణ పొందిన నారా లోకేశ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అరుదైన వ్యాధుల సమగ్ర దృష్టితో ‘ప్రాజెక్ట్‌ పునర్విక’ ప్రకటించారు. అరుదైన జన్యు వ్యాధులతో బాధపడే పిల్లల కోసం ప్రత్యేక చర్యలకు నిర్ణయించారు. అత్యంత ఖరీదైన చికిత్సల ఖర్చు తగ్గింపు, చికిత్సల అందుబాటు సులభతరం చేయడంపై దృష్టి సారించారు. ఇందుకోసం అరుదైన జన్యువాదులతో బాధపడే పిల్లల సంరక్షణ లక్ష్యంగా ప్రాజెక్ట్ పునర్విక అమలు చేయనున్నట్లుగా తెలిపారు.