రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన ఏపీసీసీ నాయకులు
విధాత:మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం విజయవాడ ఆంధ్ర రత్నభవన్లో ఏపీసీసీ నాయకులు నివాళి అర్పించారు.ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం లీగల్సెల్ చైర్మన్ గురునాధం మాట్లాడుతూ భారత దేశానికి సాంకేతిక సమకూర్చి అభివృద్ధిబాటలో పెట్టిన దార్శనికుడు అన్నారు.పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ మాట్లాడుతూ దేశాన్ని కమ్యూనికేషన్ రంగంలో అగ్రరాజ్యాల సరసన చేర్చిన రాజనీతిజ్ఞుడు అన్నారు. పీసీసీ కార్యదర్శి రవికాంత్ పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్ఠంచేసిన నేతగా అభివర్ణించారు .ఈ […]

విధాత:మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం విజయవాడ ఆంధ్ర రత్నభవన్లో ఏపీసీసీ నాయకులు నివాళి అర్పించారు.ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం లీగల్సెల్ చైర్మన్ గురునాధం మాట్లాడుతూ భారత దేశానికి సాంకేతిక సమకూర్చి అభివృద్ధిబాటలో పెట్టిన దార్శనికుడు అన్నారు.పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ మాట్లాడుతూ దేశాన్ని కమ్యూనికేషన్ రంగంలో అగ్రరాజ్యాల సరసన చేర్చిన రాజనీతిజ్ఞుడు అన్నారు. పీసీసీ కార్యదర్శి రవికాంత్ పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్ఠంచేసిన నేతగా అభివర్ణించారు .ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకుడు బేగ్,సేవాదళ్ కార్యదర్శి బేగ్ తదితరులు పాల్గొన్నారు.