బ్యాంకులో బంగారం మాయం
రాప్తాడు మండలంలోని హంపాపురం కెనరా బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు వెనక్కి ఇవ్వాలని ఖాతాదారులు బ్యాంకు ఎదుట నిరసన తెలిపారు. ఖాతాదారులు మహాబూబ్ బాషా, షేక్‌షావలి, సాదిక్‌వలి, మమత, మల్లయ్య, మస్తాన్, ఈశ్వరమ్మ, సావిత్రి, అలి అక్బర్ మాట్లాడుతూ.. పది మంది మూడేళ్ల కిందట సుమారు 50 తులాల బంగారు ఆభరణాలు వ్యక్తిగత అవసరాల నిమిత్తం తాకట్టు పెట్టామన్నారు. రెండేళ్ల కిందట బ్యాంకులో విధులు నిర్వహించే ఓ ఉద్యోగి బంగారు ఆభరాణాలు మార్చారని ఆరోపించారు. స్థానిక […]

రాప్తాడు మండలంలోని హంపాపురం కెనరా బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు వెనక్కి ఇవ్వాలని ఖాతాదారులు బ్యాంకు ఎదుట నిరసన తెలిపారు. ఖాతాదారులు మహాబూబ్ బాషా, షేక్‌షావలి, సాదిక్‌వలి, మమత, మల్లయ్య, మస్తాన్, ఈశ్వరమ్మ, సావిత్రి, అలి అక్బర్ మాట్లాడుతూ.. పది మంది మూడేళ్ల కిందట సుమారు 50 తులాల బంగారు ఆభరణాలు వ్యక్తిగత అవసరాల నిమిత్తం తాకట్టు పెట్టామన్నారు.
రెండేళ్ల కిందట బ్యాంకులో విధులు నిర్వహించే ఓ ఉద్యోగి బంగారు ఆభరాణాలు మార్చారని ఆరోపించారు. స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కోర్టులో బంగారు అప్పగించారన్నారు. తాము తాకట్టు పెట్టిన బంగారు విడిపించుకొనేందుకు వస్తే రోజూ జాప్యం చేస్తున్నారన్నారు. బ్యాంకు అధికారులు స్పందించి న్యాయం చేయాలన్నారు. సమస్యపై బ్యాంకు మేనేజరు వెంకటేష్‌తో ప్రస్తావించగా.. బ్యాంకు ఉన్నతస్థాయి అధికారులకు సమస్యను విన్నవించి వారం రోజుల్లో బంగారు ఆభరణాలు ఇస్తామన్నారు.