Bangladesh fishermen| శ్రీకాకుళం తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ జాలర్ల బోటు

తుపాన్ లో దారి తప్పిన ఓ బంగ్లాదేశ్ మత్స్యకారుల బోటు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల పేట మండలం మూసవానిపేట తీరానికి కొట్టుకొచ్చింది. ఆహారం, ఇంధనం అయిపోవడంతో ఆ బోటులోని జాలర్లు దయనీయ పరిస్థితిలో చిక్కుకుని అనారోగ్యంతో నిరసించిపోయారు. స్థానికులు, మెరైన్ పోలీసులు బంగ్లాదేశ్ మత్స్య కారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

Bangladesh fishermen| శ్రీకాకుళం తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ జాలర్ల బోటు

న్యూఢిల్లీ : తుపాన్ లో దారి తప్పిన ఓ బంగ్లాదేశ్ మత్స్యకారుల(Bangladesh fishermen Boat)) బోటు శ్రీకాకుళం జిల్లా(Srikakulam district) ఎచ్చర్ల పేట మండలం మూసవానిపేట తీరానికి కొట్టుకొచ్చింది. ఆహారం, ఇంధనం అయిపోవడంతో ఆ బోటులోని జాలర్లు దయనీయ పరిస్థితిలో చిక్కుకుని అనారోగ్యంతో నిరసించిపోయారు. స్థానికులు, మెరైన్ పోలీసులు బంగ్లాదేశ్ మత్స్య కారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బోటులోని వారి వేష, భాషలను చూసి బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఆహారం లేక మాట్లాడలేకపోతున్న వీరికి స్థానికులు కొత్త దుస్తులు, ఆహారం, నీరు అందించారు. అవసరమైన వారికి వైద్య చికిత్స చేశారు. సీఐ బి.ప్రసాదరావు, ఎస్సై జి.లక్ష్మణరావులు తెలిపిన వివరాల మేరకు కొన్ని రోజుల క్రితం వారానికి సరిపడా ఇంధనం, ఆహారంతో సముద్రంలో వేటకు బయల్దేరని బంగ్లాదేశీయులు తుపాను ప్రభావంతో సముద్రంలో తప్పిపోయారు.

ఇంధనం, ఆహారంతో ఏడు రోజులు గడిపిన వీరినకి తిరిగి వెళ్లే దారి తెలియక, ఆహారం లేక ఆకలితో తల్లడిల్లిపోయారు. ఆటుపోట్లకు వారి బోటు ఒరిస్సా మీదుగా మూసవానిపేటకు చేరుకుంది. ఇక్కడ వారు బోటుకు లంగరు వేసి ఉండిపోయారు. స్థానికులు అది తమ ప్రాంతానికి సంబంధించిన బోటు కాదని గుర్తించిన పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, మెరైన్ సిబ్బంది మూడు బోట్ల సాయంతో వారిని ఒడ్డుకు చేర్చారు. ఆహారం, నీరు లేక నిరసించి పోయిన జాలర్లకు అవసరమైన సహాయం అందించారు. అనంతరం కళింగపట్నం పోలీసుస్టేషన్‌కు తరలించారు. అయితే అక్రమంగా దేశ సరిహద్దులు దాటినందుకు వారిపై చట్టప్రకారం కేసు నమోదు చేస్తామని పోలీసులు ప్రకటించారు.