Site icon vidhaatha

రాజ‌ధానిని విశాఖ‌కు త‌ర‌లించ‌డం ఖాయం

విధాత‌: రాజమండ్రి మీడియా స‌మావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాజధాని విశాఖకు తరలింపు ఖాయం అన్నారు.సాంకేతిక సమస్యలపై కోర్టులను ఒప్పిస్తాం,ప్రతి కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వెల్ల‌డించారు.

చంద్రబాబుకు,లోకేష్ కు ఎక్కడ అడ్రస్ ?,నాకు అడ్రస్ వుంది.. ఆయనకు వుందా..వాళ్ల‌కు ఇళ్ళులెక్కడ వున్నాయి.రాష్ట్ర ప్రజలకోసమే పనిచేస్తున్నామంటూ ప్రక్కరాష్ట్రంలో వుంటారా అని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ను ఇళ్ళు ఎక్కడవుందో చెప్పమనండి.ప్రతిపక్షంలో వుండగానే జగన్ తాడేపల్లి లో ఇళ్ళు ఏర్పాటు చేసుకున్నారు.చంద్ర‌బాబు మాకు నీతులు, సుద్దులు చెబుతారా..అమరావతి కౌలు రైతులకు ముందుగానే కౌలు చెల్లిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

Exit mobile version