రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై జలవనరుల శాఖ అధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సమావేశంలో సమగ్రంగా వివరించిన అధికారులు పోలవరం ప్రాజెక్టు పనులు:విధాత:పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రగతిని సీఎంకు వివరించిన అధికారులు స్పిల్‌వే కాంక్రీట్‌ పనుల్లో 91 శాతం పూర్తయ్యాయని, జూన్‌ 15 కల్లా మిగిలిన పనులు పూర్తి చేస్తామని వెల్లడి.రేడియల్‌ గేట్లలో 42 బిగించగా, ఇంకా 6 పెండింగులో ఉన్నాయని, వాటిని కూడా వేగంగా బిగిస్తామన్న అధికారులు.జర్మనీ నుంచి మిగిలిన 14 హైడ్రాలిక్‌ సిలిండర్లు కూడా త్వరలోనే ఇక్కడికి చేరనున్నాయని తెలిపిన అధికారులు.ఇప్పటికే బిగించిన […]

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై జలవనరుల శాఖ అధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సమావేశంలో సమగ్రంగా వివరించిన అధికారులు

పోలవరం ప్రాజెక్టు పనులు:
విధాత:పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రగతిని సీఎంకు వివరించిన అధికారులు స్పిల్‌వే కాంక్రీట్‌ పనుల్లో 91 శాతం పూర్తయ్యాయని, జూన్‌ 15 కల్లా మిగిలిన పనులు పూర్తి చేస్తామని వెల్లడి.రేడియల్‌ గేట్లలో 42 బిగించగా, ఇంకా 6 పెండింగులో ఉన్నాయని, వాటిని కూడా వేగంగా బిగిస్తామన్న అధికారులు.జర్మనీ నుంచి మిగిలిన 14 హైడ్రాలిక్‌ సిలిండర్లు కూడా త్వరలోనే ఇక్కడికి చేరనున్నాయని తెలిపిన అధికారులు.ఇప్పటికే బిగించిన అన్ని గేట్లను పూర్తిగా ఎత్తిపెట్టి రాబోయే వరద నీటిని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశామన్న అధికారులు.

ఈ నెలాఖరు కల్లా స్పిల్‌ ఛానల్‌ పనులు సేఫ్‌ స్టేజ్‌ దశకు చేరుకుంటాయని వెల్లడి.ఎగువ కాఫర్‌ డ్యాంలో అక్కడక్కడ మిగిలిన పనులతో పాటు, వాటికి సంబంధించి సంక్లిష్టమైన పనులను పూర్తి చేశామని వెల్లడించిన అధికారులు.కాఫర్‌ డ్యాంలోని అన్ని రీచ్‌లను జూన్‌ నెలాఖరు నాటికి 38 మీటర్ల ఎత్తుకు, అలాగే జూలై చివరి నాటికి పూర్తిస్థాయిలో పెంచుతామని సీఎంకు వివరించిన అధికారులు.

పోలవరం అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్డు: సీఎం
పోలవరం ప్రాజెక్టు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టు అన్న సీఎం.
ప్రాజెక్టులో దిగువ కాఫర్‌ డ్యాంకు సంబంధించిన మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశం
ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలపైనా సమీక్ష.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా చర్చ.

నిధులు రాబట్టండి:
దాదాపు రూ.1600 కోట్ల బిల్లులు వేర్వేరు దశల్లో కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడి.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసిన ఖర్చుకు సంబంధించి కేంద్రంలో బిల్లులు పెండింగులో ఉండడం సరి కాదు.
అధికారులు వెంటనే దీనిపై దృష్టి పెట్టాలి. చేసిన ఖర్చు వెంటనే రీయింబర్స్‌ అయ్యేలా చూడాలి.
వచ్చే మూడు నెలల కాలానికి కనీసం రూ.1400 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు.
డిల్లీ వెళ్లి వెంటనే పెండింగులో ఉన్న బిల్లులు క్లియర్‌ అయ్యేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశం.

ఆ తపనతో ముందుకెళ్తున్నాం:
యుద్ధప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే తలంపుతో ప్రభుత్వం ఉంది.
అందుకే పనులు ఆగకుండా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫునుంచి డబ్బులు ఇస్తున్నాం.
ఈ ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా అందించాలనే తపనతో ఉన్నాం.
ఆర్థికంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రాజెక్టు పట్ల సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నాం.

ఇతర ప్రాధాన్యతా ప్రాజెక్టులు:
వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణం పైనా దృష్టి పెట్టాలని సీఎం ఆదేశం
నేరడి బ్యారేజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని నిర్దేశం.
చర్చల కోసం ఇప్పటికే ఒడిశా సీఎస్‌కు లేఖ రాశామని, వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నామన్న సీఎస్‌
త్వరలోనే నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశా అధికారులతో మాట్లాడతామన్న సీఎస్‌

నెల్లూరు బ్యారేజీ నిర్మాణం జులై 31 నాటికి పూర్తవుతుందని వెల్లడించిన అధికారులు
సంగం బ్యారేజీ పనులు కూడా 84శాతం పనులు పూర్తయ్యాయని, జులై 31 నాటికి ఆ పనులు పూర్తవుతాయని వెల్లడి.

అవుకు టన్నెల్‌లో రెండుౖ వెపుల నుంచి పనులు చేస్తున్నామన్న అధికారులు
అందులో ఇంకా 116 మీటర్ల పని మిగిలి ఉందని వెల్లడి.
వచ్చే మూడు నెలల్లో పనులు పూర్తి చేయగలుగుతామని తెలిపిన అధికారులు
ఫాల్ట్‌ ఏరియాను పాలి యూథిరేన్‌ ఫోమ్‌ (పీయూఎం) రసాయన మిశ్రమం ద్వారా ఫోర్‌ పోలింగ్‌ ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తున్నామన్న అధికారులు.

వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్‌–1 పూర్తిగా సిద్ధమైందన్న అధికారులు.
టన్నెల్‌ –2 హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు కూడా అనుకున్న ప్రకారం ఆగస్టు నాటికి పూర్తి చేస్తామన్న అధికారులు.
టన్నెల్‌– 2 నిడివి 18.787 మీటర్లు కాగా, ఇంకా 7.335 మీటర్ల పని మిగిలి ఉందని వెల్లడి.
వెంటనే టన్నెల్‌ –2 పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశం
పనులు ఆలస్యం కాకుండా, యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలన్న సీఎం
రెండో టన్నెల్‌ పనుల్లో కచ్చితంగా పురోగతి కనిపించాలని, వచ్చే సమావేశానికి కార్యాచరణ ప్రణాళికతో రావాలని సీఎం ఆదేశం

వంశధార స్టేజ్‌–2, ఫేజ్‌–2 పనులపైనా సీఎం సమీక్ష.
పనులు వేగంగా నడవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి.
వీటన్నింటినీ ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా తీసుకున్నామని, అందువల్ల పనులు ఆలస్యం కావడానికి వీల్లేదన్న సీఎం
వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనులు కూడా సత్వరమే పూర్తి చేయాలన్న సీఎం

తోటపల్లి బ్యారేజీ ప్రాజెక్టులో మిగిలిపోయిన పనులపైనా సీఎం సమీక్ష
భూసేకరణ పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయని, అందువల్ల ఆ పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్న అధికారులు.గజపతినగరం బ్రాంచ్‌ కెనాల్‌ పనులపైనా దృష్టి పెట్టాలన్న సీఎం
భూసేకరణకు సంబంధించి ఉన్న సమస్యలను కొలిక్కి తీసుకొస్తున్నామన్న అధికారులు

తారకరామ తీర్థసాగరం రిజర్వాయర్‌ పనులపైనా సీఎం సమీక్ష
గత ప్రభుత్వం హయాంలో కాంట్రాక్టరు కోర్టుకు వెళ్లారని, న్యాయపరమైన ఈ సమస్యను తొలగించి ముందడుగు వేస్తున్నామని తెలిపిన అధికారులు మహేంద్రతనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పైనా సీఎం సమీక్ష.

బ్రహ్మసాగర్, పైడిపాలెం ప్రాజెక్టుల మరమ్మతులను సత్వరమే చేపట్టాలని సీఎం ఆదేశం
బ్రహ్మసాగర్‌ సామర్థ్యం మేరకు పూర్తిస్థాయిలో నిల్వచేయడానికి అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలన్న సీఎం

ఎస్పీవీ ప్రాజెక్టులు:
రాయలసీమ కరువునివారణ ప్రాజెక్టులు,
పల్నాడు ప్రాంత కరువు నివారణా ప్రాజెక్టులు,
ఏపీ గోదావరి కృష్ణ సలైనటీ మిటిగేషన్‌ మరియు వాటర్‌ సెక్యూరిటీ ప్రాజెక్టులు,
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు.
వీటన్నింటిపైనా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష
ఆయా ప్రాజెక్టుల పరంగా సన్నద్ధత, ఆర్థిక వనరుల సేకరణ తదితర అంశాలపై సీఎం సమీక్ష
ఇప్పటికే రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుకు స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ ఏర్పాటు చేశామన్న అధికారులు.
ఈ ప్రాజెక్టుకు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రూ.12,056 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలిపిన అధికారులు.
వైయస్సార్‌ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టుకు కూడా రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ రూ.2750 కోట్ల రుణం మంజూరు చేసిందని, అందులో రూ.850 కోట్లు ఇప్పటికే మార్చిలో విడుదల చేశారని అధికారుల వెల్లడి.
రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల కింద ఉన్న భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌కు సంబంధించిన అన్ని బిల్లులను మంజూరు చేయాలని, ఇంకా ఏమైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, నీటిపారుదల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డితో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.