ఇంటర్నెట్ తో కూడిన కంప్యూటర్స్ ఏర్పాటు చేయాలి..NTA
పాఠశాల గ్రాంటు వినియోగం కై పాఠశాల సముదాయాలలో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయులను నియమించాలి.ఇంటర్నెట్ తో కూడిన కంప్యూటర్స్ ఏర్పాటు చేయాలి.పిడి అకౌంట్స్ నిర్వహణపై ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి.గత సంవత్సరం ఖర్చుచేసిన మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్లైమ్ చేసుకోవడానికి మార్గదర్శకాలు జారీ చేయాలి. పీ. డి. అకౌంటుకు సంబంధించిన బిల్లులు సి ఎఫ్ ఎం ఎస్ లో పెండింగ్ లేకుండా వెంటనే క్లియర్ చేయాలి. నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ విధాత:పాఠశాల స్కూల్ గ్రాంట్ వినియోగం కొరకు […]

- పాఠశాల గ్రాంటు వినియోగం కై పాఠశాల సముదాయాలలో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయులను నియమించాలి.
ఇంటర్నెట్ తో కూడిన కంప్యూటర్స్ ఏర్పాటు చేయాలి.
పిడి అకౌంట్స్ నిర్వహణపై ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి.
గత సంవత్సరం ఖర్చుచేసిన మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్లైమ్ చేసుకోవడానికి మార్గదర్శకాలు జారీ చేయాలి. - పీ. డి. అకౌంటుకు సంబంధించిన బిల్లులు సి ఎఫ్ ఎం ఎస్ లో పెండింగ్ లేకుండా వెంటనే క్లియర్ చేయాలి.
నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్
విధాత:పాఠశాల స్కూల్ గ్రాంట్ వినియోగం కొరకు పాఠశాలల పిడి అకౌంట్ నిర్వహణకు సహకారం నిమిత్తం క్లస్టర్ కు ఒకరు చొప్పున సాంకేతిక నిపుణులు మరియు కంప్యూటర్ లను ఏర్పాటు చేయాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ (ఎన్ టి ఏ – ఏ పి రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు కరణం హరికృష్ణ,మాగంటి శ్రీనివాసరావు లు ఆర్థిక ముఖ్య కార్యదర్శి ,సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ,సి ఎఫ్ ఎం ఎస్ ముఖ్య పరిపాలనాధికారి వారిని లేఖల ద్వారా కోరారు.పాఠశాలకు సంబంధించిన పేరెంట్స్ కమిటీ బ్యాంక్ అకౌంట్ కు కాకుండా పి.డి అకౌంట్ కు పాఠశాల గ్రాంట్ను వేయడం వలన ఉపాధ్యాయులు పాఠశాల గ్రాంటు నిధులను డ్రా చేయడానికి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలుపారు.సమస్యలను పరిష్కారించాలని చెప్పారు.
పిడి అకౌంట్స్ వినియోగం పై ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వలేదని అన్నారు.సి. ఎఫ్. ఎం.ఎస్. లో నిధుల విడుదల ఆలస్యం అవుతున్న కారణంగా నిధులను ఉపయోగించుకోలేకపోతున్నారని విశదీకరించారు.గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాడుకోవడానికి సరైన మార్గదర్శకాలు లేకపోవడం వలన గత ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసిన మొత్తం కూడా ప్రస్థుత ఆర్థిక సంవత్సరంలో క్లెయిమ్ చేసుకోవడానికి వెనుకాడుతున్నారని వివరించారు. ఇది కూడా నిధుల వినియోగం కాకపోవడానికి ప్రధాన కారణంగా ఉందని విశ్లేషించారు.చాలా మంది ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వలన నిధులు వినియోగించుకోలేక పోతున్నారని మనవి చేశారు.
కావున పాఠశాల గ్రాంట్స్ వినియోగం పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు.పిడి అకౌంట్స్ నిర్వహణ పై శిక్షణ అవసరం అని తెలిపారు.గత ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసిన మొత్తం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్లైమ్ చేసుకోవడానికి మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు.పాఠశాలలకు పి. డి. అకౌంటుకు సంబంధించిన బిల్లులు సి ఎఫ్ ఎం ఎస్ లో పెండింగ్ లేకుండా వెంటనే క్లియర్ అయ్యేలా చూడాలన్నారు. ఇందు నిమిత్తమై సాంకేతిక పరిజ్ఞానం పోందడానికి పాఠశాల సముదాయాలలో ఇంటర్నెట్ తో కూడిన కంప్యూటర్స్ ఏర్పాటు చేయాలి మరియు కంప్యూటర్ ఆపరేటర్ను నియమించాలి./కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయిలను పాఠశాల సముదాయాలకు కేటాయించాలని కోరుతూ పాఠశాల గ్రాంటు ను పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.