AP MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ.. జోరుగా బెట్టింగులు

విధాత: ఏపీ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ (MLA Quota MLC Election) ఎన్నికలలో ఏడు స్థానాలకు 8 మంది అభ్యర్థులు పోటీ పడడంతో ఫలితాలపై ఉత్కంఠ పెరిగింది. ఏడు స్థానాలు మేమే గెలుస్తామని వైసీపీ (YCP) అంటుండగా, టీడీపీ (TDP) పోటీ చేసిన ఒక స్థానాన్ని ఖచ్చితంగా గెలుస్తామని టీడీపీ నాయకులు చెబుతున్నారు. టీడీపీకి 21 ఓట్లు ఉండగా గెలవడానికి ఆ పార్టీకి ఒక ఓటు అవసరం. దీంతో జోరుగా ఫలితాలపై బెట్టింగులు సాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా […]

  • By: Somu    latest    Mar 23, 2023 12:16 PM IST
AP MLC Election | ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ.. జోరుగా బెట్టింగులు

విధాత: ఏపీ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ (MLA Quota MLC Election) ఎన్నికలలో ఏడు స్థానాలకు 8 మంది అభ్యర్థులు పోటీ పడడంతో ఫలితాలపై ఉత్కంఠ పెరిగింది.

ఏడు స్థానాలు మేమే గెలుస్తామని వైసీపీ (YCP) అంటుండగా, టీడీపీ (TDP) పోటీ చేసిన ఒక స్థానాన్ని ఖచ్చితంగా గెలుస్తామని టీడీపీ నాయకులు చెబుతున్నారు. టీడీపీకి 21 ఓట్లు ఉండగా గెలవడానికి ఆ పార్టీకి ఒక ఓటు అవసరం.

దీంతో జోరుగా ఫలితాలపై బెట్టింగులు సాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేశారా అన్న సందేహాలు వ్యక్తం అవుతుండగా ఎన్నికల్లో మొత్తం 175ఓట్లకు అన్ని ఓట్లు పొలయ్యాయి. ఎవరి ఓట్లయినా మురిగిపోయిన పక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు.