ఏపీలో 14వేలు దాటిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ వైరస్‌బారిన పడుతోన్న బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య సైతం పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,681 పరీక్షలు నిర్వహించగా.. 14,669 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనాతో బాధపడుతూ 71 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం ఇప్పటివరకూ 1,62,17,831 కరోనా పరీక్షలు నిర్వహిస్తే, 10,69,544మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.

ఏపీలో 14వేలు దాటిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ వైరస్‌బారిన పడుతోన్న బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య సైతం పెరుగుతోంది.

గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,681 పరీక్షలు నిర్వహించగా.. 14,669 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనాతో బాధపడుతూ 71 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం ఇప్పటివరకూ 1,62,17,831 కరోనా పరీక్షలు నిర్వహిస్తే, 10,69,544మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.