పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి రావద్దు .
అభిమానులు, పార్టీ కార్యకర్తలకు టీటీడీ చైర్మన్ వైవి విజ్ఞప్తి

అభిమానులు, పార్టీ కార్యకర్తలకు టీటీడీ చైర్మన్ వైవి విజ్ఞప్తి
మే 1 వ తేదీ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలెవరు తనను కలవడానికి రావద్దని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
కరోనా సంక్షోభ సమయంలో అందరూ తగు జాగ్రత్తలు పాటిస్తూ తాము ఆరోగ్యంగా ఉంటూ సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచాలని సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. తన అభిమానులు ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని కోరారు. శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరారు.