నదిలోకి ఎవ్వరు వెళ్ళకండి.. కలెక్టర్ జె.నివాస్
అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ జె.నివాస్విధాత:పులిచింతల డ్యాం 16 వ గేట్ సాంకేతిక సమస్య.దీని స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేస్తారు.ఇందుకు డ్యాం లో నీటి నిల్వ తగ్గించాల్సి వస్తోంది. లేని ఎడల ఆ నీటి వత్తిడి ఇతర గేట్ల పై పడే అవకాశం ఉంది.ప్రకాశం బ్యారేజీకి 5 లక్షల క్యూసెక్కుల వరకు 8 నుంచి 12 గంటల స్వల్ప వ్యవధిలో ఫ్లష్ ఫ్లూడ్ చేరనున్నది.ఈ దృష్ట్యా అధికారులు, నదిపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా […]

అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ జె.నివాస్
విధాత:పులిచింతల డ్యాం 16 వ గేట్ సాంకేతిక సమస్య.దీని స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేస్తారు.ఇందుకు డ్యాం లో నీటి నిల్వ తగ్గించాల్సి వస్తోంది. లేని ఎడల ఆ నీటి వత్తిడి ఇతర గేట్ల పై పడే అవకాశం ఉంది.ప్రకాశం బ్యారేజీకి 5 లక్షల క్యూసెక్కుల వరకు 8 నుంచి 12 గంటల స్వల్ప వ్యవధిలో ఫ్లష్ ఫ్లూడ్ చేరనున్నది.ఈ దృష్ట్యా అధికారులు, నదిపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలి.ప్రజలెవరూ నదిలోకి వెళ్ళ రాదు.తహశీల్దార్ లు,రెవెన్యూ సిబ్బంది ని అప్రమత్తం చేశాం.పశువులు ,పడవలు జాగ్రత్త.పిల్లలు ,ముసలి వాళ్ళు లోతట్టు ప్రాంతాల నుంచి తరలి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి.పులిచింతల డ్యాం వద్ద ప్రస్తుతం ఔట్ ఫ్లో 2,00,804 క్యూసెక్కులు ఉండగా,ఇన్ ఫ్లో 1,10,000 క్యూసెక్కులు.ప్రకాశం బ్యారేజీ వద్ద ఔట్ ఫ్లో 33,750 క్యూసెక్కులు కాగా, ఇన్ ఫ్లో 41,717 క్యూసెక్కులు ఉంది.