Srikakulam | శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్
శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్ చేస్తుంది. వంగర మండలం వివిఆర్ పేట, రాజుల గుమడ గ్రామల్లో తిష్ట వేసిన ఏనుగుల గుంపు పంట పొలాలను ధ్వంసం చేస్తు ముందుకు సాగిపోతున్నాయి
విధాత, హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్ చేస్తుంది. వంగర మండలం వివిఆర్ పేట, రాజుల గుమడ గ్రామల్లో తిష్ట వేసిన ఏనుగుల గుంపు పంట పొలాలను ధ్వంసం చేస్తు ముందుకు సాగిపోతున్నాయి. దీంతో ఆ గ్రామాల ప్రజలు భయాంధోళనకు గురవుతున్నారు. అధికారులు ముందు జాగ్రత్తగా ఆ గ్రామాలకు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. ఏనుగుల గుంపును సమీప అటవీ ప్రాంతంవైపు తరిమిసేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
అంతకుముందు పార్వతిపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఖడ్గవలసలో ఏనుగుల గుంపు హల్ చల్ చేసింది. వారం రోజులుగా బలిజిపేట సీతనగరం మండలంలో సంచరించిన ఏనుగులు నేడు ఖడ్గవలసలో ప్రత్యక్షమయ్యాయి. గ్రామంలో ఉన్న రైస్ మిల్లులోకి చొరబడ్డ ఏనుగులు….సామాగ్రిని ధ్వంసం చేశాయి. రోడ్డుపైకి వచ్చి వాహనదారులను భయబ్రాంతులకు గురి చేశాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram