మాజీ ఎంపీ సబ్బం హరి ఇకలేరు
ఆరిలోవ అపోలోలో చికిత్స పొందుతూ మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత. మాజీ ఎంపీ సబ్బం హరి కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. కరోనా బారిన పడిన సబ్బం హరి గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనకు కొద్ది రోజులుగా వెంటిలేటర్ పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొద్ది సేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ లో […]

ఆరిలోవ అపోలోలో చికిత్స పొందుతూ మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత.
మాజీ ఎంపీ సబ్బం హరి కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. కరోనా బారిన పడిన సబ్బం హరి గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనకు కొద్ది రోజులుగా వెంటిలేటర్ పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కొద్ది సేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ లో ఎంపిగా పని చేసిన ఆయన రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి పరాజయం పాలైయ్యారు.