Andhra Pradesh : ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్

ఏపీ సర్కార్ ఉద్యోగులకు శుభవార్త. సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిల తొలి విడత విడుదల. ఒక్కొక్కరికి ₹40,000–₹70,000 జమ.

Andhra Pradesh : ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్

ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. సీపీఎస్ ఉద్యోగులకు సోమవారం ఏపీ ప్రభుత్వం తొలి విడత బకాయిలను విడుదల చేసింది. ఒక్కో ఉద్యోగికి రూ. 40,000 నుంచి రూ. 70,000 వేలను జమ చేశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలను ఆరు విడతల్లో చెల్లించనున్నారు. ఒక్కొక్కరికి రూ. 2 నుంచి రూ. 4 లక్షల వరకు ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లించాల్సి ఉంది. అయితే విడతల వారీగా ఈ బకాయిలను చెల్లిస్తామని ప్రభుత్వం హమీ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఫస్ట్ ఫేజ్ బకాయిలను విడుదల చేసింది ప్రభుత్వం.

ఈ ఏడాది మార్చిలో రూ. 6200 కోట్లను ప్రభుత్వం ఉద్యోగులకు విడుదల చేసింది. సీసీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐ కింద బకాయిలను రిలీజ్ చేశారు. మ్యాచింగ్ గ్రాంట్ ను ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.ఈ ఏడాది జనవరిలో సీపీఎస్ ఉద్యోగులకు రూ.1,033 కోట్ల బకాయిలను విడుదల చేసింది. గత ప్రభుత్వం ఉద్యోగులకు రూ. 25 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటిని చంద్రబాబు సర్కార్ విడుతల వారీగా క్లియర్ చేస్తోంది. ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో ఈ ఏడాది రూ. 2300 కోట్లను జమ చేసింది. పాత పెన్షన్ విధానాన్ని ఉద్యోగులు కోరకుంటున్నారు. ఈ విషయమై కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీని అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.