తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ శుభపరిణామం, రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోవద్దు … సీపీఐ నేత నారాయణ

ఏపీ, తెలంగాణ సీఎంల మధ్య రాష్ట్ర విభజన సమస్యలపై చర్చలు జరగడం శుభపరిణామం అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ శుభపరిణామం, రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోవద్దు … సీపీఐ నేత నారాయణ

విధాత, హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ సీఎంల మధ్య రాష్ట్ర విభజన సమస్యలపై చర్చలు జరగడం శుభపరిణామం అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న విభజన చట్టంలోని సమస్యల పరిష్కారం కోసం కమిటీలు వేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అవసరమైతే సమస్యల పరిష్కారానికి ఇచ్చుపుచ్చుకునే ధోరణి వ్యవహరించాలని సూచించారు. ఈ చర్చల సందర్భంగా అన్ని విభజన సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. రెండు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం వేళ కొందరు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోవద్దన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలు పరిష్కారానికి చొరవ చూపిన ఇద్దరు సీఎంలను అభినందించారు.