జీవోలు ఆన్‌లైన్‌లో ఉంచకూడదన్న పిటిషన్‌పై విచారణ

విధాత‌: జీవోలు ఆన్‌లైన్‌లో ఉంచకూడదన్న పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్లు వేశాక ప్రభుత్వం జీవో 100ను విడుదల చేసిందని పిటిషనర్లు పేర్కొన్నారు. జీవో నంబరు 100లో సీక్రెట్, టాప్ సీక్రెట్, కాన్ఫిడెన్షియల్ పేరిట జీవోలను.. మళ్లీ విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారని న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4, 8కు జీవో విరుద్ధంగా ఉందని న్యాయవాదులు ఇంద్రనీల్ బాబు, యలమంజుల బాలాజీ కోర్టుకు వెల్లడించారు. రహస్యం పేరిట జీవోలను పెట్టకపోవడం ఏంటని […]

జీవోలు ఆన్‌లైన్‌లో ఉంచకూడదన్న పిటిషన్‌పై విచారణ

విధాత‌: జీవోలు ఆన్‌లైన్‌లో ఉంచకూడదన్న పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్లు వేశాక ప్రభుత్వం జీవో 100ను విడుదల చేసిందని పిటిషనర్లు పేర్కొన్నారు. జీవో నంబరు 100లో సీక్రెట్, టాప్ సీక్రెట్, కాన్ఫిడెన్షియల్ పేరిట జీవోలను.. మళ్లీ విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారని న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4, 8కు జీవో విరుద్ధంగా ఉందని న్యాయవాదులు ఇంద్రనీల్ బాబు, యలమంజుల బాలాజీ కోర్టుకు వెల్లడించారు. రహస్యం పేరిట జీవోలను పెట్టకపోవడం ఏంటని హైకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పిటిషనర్లు తాజా పిటిషన్ దాఖలు చేసిన అనంతరం ప్రభుత్వం కౌంటర్ వేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.