">

“సేవ హే సంఘటన్” పేరుతో ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్ ను ప్రారంభించిన డా.కె.లక్ష్మణ్ – vidhaatha " /> " />

“సేవ హే సంఘటన్” పేరుతో ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్ ను ప్రారంభించిన డా.కె.లక్ష్మణ్

జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి పిలుపు మేరకు " సేవ హే సంఘటన్" కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ భాజపా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ సెంటర్ ను ప్రారంభించిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ గారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఓబీసీ మోర్చా ఈ కార్యక్రమానికి ఓబీసీ మోర్చా అధ్యక్షులు బిట్ర వెంకట్ శివనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గోన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి పార్టీ ప్రధాన కార్యదర్శిలు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి,వేటుకూరి సూర్యనారాయణ రాజు,లోకుల […]

  • Publish Date - May 4, 2021 / 02:35 PM IST

జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి పిలుపు మేరకు ” సేవ హే సంఘటన్” కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ భాజపా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ సెంటర్ ను ప్రారంభించిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ గారు.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఓబీసీ మోర్చా ఈ కార్యక్రమానికి ఓబీసీ మోర్చా అధ్యక్షులు బిట్ర వెంకట్ శివనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గోన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి పార్టీ ప్రధాన కార్యదర్శిలు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి,వేటుకూరి సూర్యనారాయణ రాజు,లోకుల గాంధీ మరియు ఓబీసీ మోర్చా నాయకులు రంజిత్ రూపొందించిన ఈ హెల్ప్ లైన్ కోసం ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్ వివరాలను వీడియో సందేశం ద్వారా వివరించారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లు వేరు వేరు సర్వీసు ఏర్పాటు చేయగా ఓబీసీ మోర్చా ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లో అన్ని సేవలు ఒకే గొడుగు క్రిందకు చేర్చి అన్నీ సేవలకు ఒకే సెంటర్లో ఏర్పటు చేయటం మన ప్రత్యేకత గా చెప్పారు.

రాష్ట్రంలో ఎవరికైనా టెస్టులు చేయాలన్న,ఒకవేళ కోవిడ్ నిర్ధారణ జరిగితే వారికి అవసరానికి మేరకు మెడికల్ హెల్ప్,లేక బెడ్స్ కొరత వున్నా సత్వరమే వారికి బెడ్ ఏర్పాటు,అలానే ఎవరికైనా ఆహార సదుపాయాలు అవసరం మేరకు సంఘ్ పరివార్ ఆధ్వర్యంలో నామమాత్రపు రుసుముతో భోజన సదుపాయం ఈ సేవలు అందుబాటులో వుంటాయని తెలిపారు.

లక్ష్మణ్ మాట్లాడుతూ దేశంలోనే కాకుండా ప్రపంచాన్ని సైతం వణికిస్తున్న ఈ మహమ్మరిని నియంత్రణలో కేంద్ర పార్టీ పిలుపు భాగంగా ఒక రాజకీయ పార్టీ బాధ్యతగా ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా ఈ కార్యక్రమం చేపట్టడాన్ని అభినందనీయమని అన్నారు.అందరూ సేవాకార్యక్రమాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూపాల్గొనాలని తెలిపారు.

Latest News