రాష్ట్రంలో ఇళ్ల పండగ

విధాత:శ్రీకాకుళం, మే 3 : రాష్ట్రంలో ఇళ్ల పండుగ జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ అన్నారు. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా పేదలందరికి ఇళ్ళు శంఖుస్థాపన కార్యక్రమం లావేరు మండలం బెజ్జిపురంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాల్గొని లాంఛనంగా ఇళ్లకు శంఖుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్ళు నిర్మించే కార్యక్రమం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలకు […]

రాష్ట్రంలో ఇళ్ల పండగ

విధాత:శ్రీకాకుళం, మే 3 : రాష్ట్రంలో ఇళ్ల పండుగ జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ అన్నారు. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా పేదలందరికి ఇళ్ళు శంఖుస్థాపన కార్యక్రమం లావేరు మండలం బెజ్జిపురంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాల్గొని లాంఛనంగా ఇళ్లకు శంఖుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్ళు నిర్మించే కార్యక్రమం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. సొంత ఇల్లు వలన సామాజిక గౌరవం పెరుగుతుందని, ఆర్ధికంగా భద్రత ఉంటుందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. సంక్రాంతిలో ఇళ్ల పట్టాల పండుగ జరుగగా, ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం పండుగ జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో 94 శాతం ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుందని క్రిష్ణ దాస్ పేర్కొన్నారు. ప్రజా రంజకంగా పాలన జరుగుతుందని అన్నారు.

సమర్ధవంతమైన ముఖ్యమంత్రి జగన్ అని, చక్కటి పాలన అందిస్తున్న ముఖ్యమంత్రుల్లో దేశంలో 3వ స్థానంలో నిలిచారని చెప్పారు. బిసిలకు 58 కార్పొరేషన్ లను ఇచ్చిన ముఖ్యమంత్రి అని ప్రశంసించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండటం ప్రజల అదృష్టం అని, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతోందని ఉప ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో 5 గురు ఉప ముఖ్యమంత్రులను నియమించిన ఘనత జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు, శాసన సభ్యులు గొర్లె కిరణ్ కుమార్, రెడ్డి శాంతి, కళింగ, కాపు కార్పొరేషన్ల చైర్మన్లు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, గృహ నిర్మాణ సంస్థ పిడి టి.వేణుగోపాల్, మండల ప్రత్యేక అధికారి పి.రాధ, సంబంధిత అధికారులు, అనధికారులు పాల్గొన్నారు