27 నెలల్లో.. 14 వేల పోస్టుల భర్తీ

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో రికార్డు స్థాయి నియామకాలుకొత్త జాబ్‌ క్యాలెండర్‌లో సుమారు 6 వేల ఉద్యోగాలుఖాళీల భర్తీతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగుపడ్డ సేవలువిధాత:గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాసుపత్రికి రావాలంటేనే రోగులు భయపడే పరిస్థితి. వైద్యుల కొరతతో రోగులకు సకాలంలో సరైన చికిత్స అందేది కాదు. నర్సులు నియామకాలు లేక సేవలు అరకొరగానే ఉండేవి. మందులుండేవి కావు. నిర్ధారణ పరీక్షలు జరిగేవి కావు. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక వైద్య ఆరోగ్యశాఖపై ప్రత్యేకంగా దృష్టి […]

27 నెలల్లో.. 14 వేల పోస్టుల భర్తీ

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో రికార్డు స్థాయి నియామకాలు
కొత్త జాబ్‌ క్యాలెండర్‌లో సుమారు 6 వేల ఉద్యోగాలు
ఖాళీల భర్తీతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగుపడ్డ సేవలు

విధాత:గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాసుపత్రికి రావాలంటేనే రోగులు భయపడే పరిస్థితి. వైద్యుల కొరతతో రోగులకు సకాలంలో సరైన చికిత్స అందేది కాదు. నర్సులు నియామకాలు లేక సేవలు అరకొరగానే ఉండేవి. మందులుండేవి కావు. నిర్ధారణ పరీక్షలు జరిగేవి కావు. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక వైద్య ఆరోగ్యశాఖపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రజలకు సరైన వైద్యం అందడానికి ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం ఐదేళ్లలో 1,500 పోస్టులు కూడా భర్తీ చేయలేని పరిస్థితి. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన 27 మాసాల్లోనే ఆరోగ్య శాఖలో సుమారు 14 వేల పోస్టులను భర్తీ చేసింది. రాష్ట్ర చరిత్రలోనే ఆ శాఖలో ఇది అతిపెద్ద నియామక ప్రక్రియ అని అధికారులు చెబుతున్నారు.