ఇద్దరు కింగ్ పిన్స్ సహా ఐదుగురి అరెస్టు 16,320 టెట్రా పాకెట్లు, టాటా ఏస్ , కారు స్వాధీనం జిల్లా ఎస్పీ ఆదేశాలతో సెబ్ అదనపు ఎస్పీ పెనుకొండలో మీడియాకు వివరాలు వెల్లడి విధాత: అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి ఆదేశాల మేరకు కర్నాటక మద్యంపై సెబ్ ఆధ్వ ర్యంలో పోలీసులు ఉక్కుపాదం మోపారు. భారీగా అక్రమ మద్యం పట్టుకున్నారు. కర్నాటక మద్యం అక్రమ రవాణా, రిసీవింగ్ లో ఇద్దరు కింగ్ […]
విధాత: అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి ఆదేశాల మేరకు కర్నాటక మద్యంపై సెబ్ ఆధ్వ ర్యంలో పోలీసులు ఉక్కుపాదం మోపారు. భారీగా అక్రమ మద్యం పట్టుకున్నారు. కర్నాటక మద్యం అక్రమ రవాణా, రిసీవింగ్ లో ఇద్దరు కింగ్ పిన్స్ గా ఉన్న నిందితుల సహా ఐదుగుర్ని అరెస్టు చేశారు.
వీరి నుండీ 16,320 టెట్రా పాకెట్లు(170 బాక్సులు), టాటా ఏస్ వాహనం, కారు స్వాధీనం చేసుకున్నారు. పెనుకొండ మండలం కొండంపల్లి- శెట్టిపల్లి గ్రామాల మధ్య రాబడిన కీలక సమాచారంతో దాడులు నిర్వహించారు. పెనుకొండ సెబ్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
పెనుకొండ సెబ్ స్టేషన్ లో సెబ్ అదనపు ఎస్పీ జె.రాంమోహనరావు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈసమావేశంలో పెనుకొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ , పెనుకొండ డీఎస్పీ ఎన్ రమ్య, స్పెషల్ టీం సి.ఐ నాగేంద్ర, పెనుకొండ సెబ్ సి.ఐ సుబ్బారెడ్డి, సెబ్ స్పెషల్ టీం సభ్యులు పాల్గొన్నారు.