Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

మేషం (Aries)

మేష రాశి వారికి మీరు ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో పట్టు విడుపు ధోరణి అవలంబిస్తే మంచిది. కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. కలహాలకు తావు లేకుండా కోపం అదుపులో పెట్టుకోండి. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ధనలాభాలు ఉండడంతో ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి కావడంతో సంతోషంగా ఉంటారు. గృహంలో శాంతియుతమైన వాతావరణం ఉంటుంది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనుల్లో శ్రద్ధ ఏకాగ్రత పెంచాలి. వివాదాలకు, అపార్ధాలకు దూరంగా ఉంటే మంచిది. కుటుంబ కలహాలు రాకుండా కోపం అదుపులో ఉంచుకోవాలి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో విశేషమైన ఆర్ధిక లాభాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలున్నప్పటికీ దైవానుగ్రహంతో అధిగమిస్తారు. ఆర్థికంగా క్రమంగా వృద్ధి సాధిస్తారు. ఆత్మవిశ్వాసం , దృఢ నిశ్చయంతో చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా మీ లక్ష్యానికి చేరువవుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. నూతన ఆదాయ వనరులపై దృష్టి సారిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేస్తే సత్ఫలితాలు ఉంటాయి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరంగా ఆశించిన ప్రయోజనాలు అందుకుంటారు. గ్రహబలం బాగుంది కాబట్టి ఏ పని తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. పరోపకార కార్యక్రమాలతో సమాజంలో గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారుతాయి. గ్రహాల అనుకూలత వలన ఏ పని తలపెట్టినా విజయం సునాయాసంగా దక్కుతుంది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు పనికి వస్తాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో నిర్లక్ష్యంతో నష్టాలు పెరగవచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు. మీ మనోధైర్యం మిమ్మల్ని అన్నింటా గెలిపిస్తుంది. పనిప్రదేశంలో ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. ఖర్చుల విషయంలో తెలివిగా నడుచుకోవాలి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్థిరమైన నిర్ణయాలతో ఉద్యోగంలో ఉన్నతస్థితి లభిస్తుంది. వ్యాపారులు లాభాల కోసం గట్టి కృషి చేయాలి. కీలక పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. అవసరానికి సరిపడా ధనం అందుబాటులో ఉంటుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఇంటా బయట విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. వృత్తి పరమైన శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.