A.P CM Chandrababu | ప్రాజెక్టు లను పట్టించుకోని జగన్ … సున్నిపెంట ప్రజావేదికలో ముఖ్య మంత్రి చంద్రబాబు

ఇదేళ్ల వైసీపీ పాలన లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రంగాలు విధ్వంసం సృష్టించారు...సాగు, తాగునీరు అందించే ప్రాజెక్టుపై నిర్లక్ష్యం..రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ఉంచారని ఏపీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

A.P CM Chandrababu | ప్రాజెక్టు లను పట్టించుకోని జగన్ … సున్నిపెంట ప్రజావేదికలో ముఖ్య మంత్రి చంద్రబాబు

– ఐదేళ్లు వైసీపీ పాలన లో ప్రాజెక్టులు పట్టించుకోలేదు
– ప్రాజెక్టు లకు పూర్వ వైభవం తీసుకొస్తా
– రాయల సీమ ను రతనాల సీమ గా మారుస్తా
– ఆంధ్రప్రదేశ్ లో మొన్నటి ఎన్నికలు సునామి ని తలపించాయి
– ఖాజానా ఖాళీ గా ఉన్న ఇచ్చిన హామీ లను నెరవేర్చుతాము
– ఇదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం లో విధ్వంసం సృటించింది

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ఇదేళ్ల వైసీపీ పాలన లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రంగాలు విధ్వంసం సృష్టించారు…సాగు, తాగునీరు అందించే ప్రాజెక్టుపై నిర్లక్ష్యం..రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ఉంచారని ఏపీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాజెక్టు వద్ద వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్న చంద్రబాబు ప్రాజెక్టు నుంచి నీరు విడుదల అవుతున్న దృశ్యాన్ని తిలకించారు. అంతకు ముందు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శించుకున్నారు. అనంతరం సున్ని పెంట వద్ద నిర్వహించిన ప్రజావేదికలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ..వైసీపీ పాలన లో రాయలసీమ ను పట్టించుకోలేదని, రానున్న రోజుల్లో రాయలసీమను రతనాల సీమగా మారుస్తామన్నారు.ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని,వైసీపీ పాలన లో ఐదేళ్లు ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శలు చేశారు. రాష్ట్రం లో మొన్న జరిగిన ఎన్నికలు ఒక సునామీని తలపించాయని, ఒక్కో స్థానంలో అత్యధిక మెజారటీ సాధించిన విధానం చూస్తే ప్రజలలో వైసీపీ పాలన పై ఎంత వ్యతిరేకం ఉందో అర్థం అయిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నా ఒక్కొక్క హామీని నెరవేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.నీరు సంపదను సృష్టిస్తుందని,సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. రాష్ట్రం లో సంపద సృష్టితో పేదరిక నిర్మూలన సాధ్యమన్నారు. పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పనులు పూర్తిచేస్తామని,హార్టికల్చర్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రం లో పండ్ల తోటల సాగు విస్తీర్ణాన్ని పెంచుతామని, స్కిల్ డెవలప్మెం ట్తోస ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. గతం లో తన హయాంలో ప్రాజెక్టుల కోసం రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామని, వైసీపీ పాలకులు ప్రాజెక్టు ల పేరుతో అంతా దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ పాలన దోచుకోవడం.. దాచుకోవడం అని పేర్కొన్నారు. శ్రీశైల క్షేత్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని,ప్రపంచం మొత్తం శ్రీశైలం వైపు చూసే విధంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. చంద్రబాబు వెంట ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు, తెలంగాణ రాష్ట్ర అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ, ఇతర నేతలు ఉన్నారు.