Jagan | రాజీనామా చేసేందుకు రాజ్‌భవన్‌కు సీఎం జగన్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేసేందుకు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు
గవర్నర్‌కు రాజీనామా పత్రం
విధాత, హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేసేందుకు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్ అబ్ధుల్ నజీర్‌ను కలిసి జగన్ తన రాజీనామా పత్రం సమర్పించనున్నారు. ఎన్నికల్లో వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం, మంత్రులు సైతం ఘోరంగా ఓడిపోవడం.. టీడీపీ కూటమి సునామి విజయంతో ఏకంగా 175సీట్లకుగాను 160కిపైగా స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని తేలిపోవడంతో సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం సన్నద్దమవుతున్నారు. చంద్రబాబు ఈ నెల 9న అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram