కంగనా రౌనత్ విలాసవంతమైన యాచకురాలు: నారాయణ
విధాత: దేశ స్వతంత్ర ఉద్యమాన్ని అవమానిస్తూ కంగనా రౌనత్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి 1947లో వచ్చింది స్వాతంత్రం కాదని భిక్ష అని కంగనా పేర్కొనడంపై తీవ్రంగా స్పందించారు. కంగనా ఒక విలాసవంతమైన యాచకురాలు అంటూ మండిపడ్డారు. ఆమెకు పద్మశ్రీ అవార్డు ఎ లా వచ్చిందో అందరికి తెలుసునని పేర్కొన్నారు. దేశ స్వాతంత్రం ఉద్యమంపై మాట్లాడే అర్హత ఆమెకు లేదని…ఆమెకే కాకుండా ఆమెకు పద్మశ్రీ […]

విధాత: దేశ స్వతంత్ర ఉద్యమాన్ని అవమానిస్తూ కంగనా రౌనత్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి 1947లో వచ్చింది స్వాతంత్రం కాదని భిక్ష అని కంగనా పేర్కొనడంపై తీవ్రంగా స్పందించారు. కంగనా ఒక విలాసవంతమైన యాచకురాలు అంటూ మండిపడ్డారు. ఆమెకు పద్మశ్రీ అవార్డు ఎ లా వచ్చిందో అందరికి తెలుసునని పేర్కొన్నారు.
దేశ స్వాతంత్రం ఉద్యమంపై మాట్లాడే అర్హత ఆమెకు లేదని…ఆమెకే కాకుండా ఆమెకు పద్మశ్రీ ఇచ్చిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ లకి కూడా లేదన్నారు. మోడీ ప్రధాని అయ్యాకే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని చెప్పడం ఆమె బానిస మనస్తత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తునట్టు పేర్కొన్నారు. తక్షణమే దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.