Durgamma Teppostavam Cancelled | కృష్ణానదికి భారీ వరద..దుర్గమ్మ తెప్పోత్సవం రద్దు
కృష్ణానదిలో వరద ఉద్ధృతి కారణంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి విజయదశమి తెప్పోత్సవాన్ని అధికారులు రద్దు చేశారు.

అమరావతి : కృష్ణానదికి భారీ వరద ఉద్ధృతి కారణంగా విజయవాడ ఇంద్రకిలాద్రి దసరా ఉత్సవాల ముగింపులో కనకదుర్గ అమ్మవారికి విజయదశమి రోజున నిర్వహించే హంసవాహన తెప్పోత్సవాన్ని అధికారులు రద్దు చేశారు. 2022, 2023లో కూడా దశమి రోజు వర్షం కురవడంతో తెప్పోత్సవాన్ని రద్దు చేశారు. వరద ప్రవాహం ఆరున్నర లక్షల క్యూసెక్కులకు మించి ఉంది. ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో తెప్పోత్సవ నిర్వహణను అధికారులు రద్దు చేశారు.
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు మహిషాసురమర్దిని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీమహిషాసుర మర్దిని అలంకారంలో ఉన్న అమ్మవారికి టీడీడీ తరుఫున బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, నన్నపనేని సదాశివరావు, టి.జానకి దేవి, ఎ.రంగశ్రీ.. పట్టు వస్త్రాలు సమర్పించారు.