రోడ్లపై పండ్లు, కూల్ డ్రింక్స్ లోడ్ వాహనాలు, పెట్రోల్, వంటనూనెల ట్యాంకర్లు బోల్తా పడినప్పుడు జనం చేతికందినకాడికి తీసుకెళ్లిపోవడం చూశాం. అలాగే చిత్తూరు జిల్లా ఎస్.ఆర్ పురం మండలం బసిరెడ్డిపల్లి వద్ద లిక్కర్ లోడ్ వాహనం బోల్తా కొట్టడంతో స్థానికులు ఇదే అదనుగా నిమిషాల్లో లిక్కర్, బీర్ కాటన్లను ఎత్తుకెళ్లిపోయారు. సుమారు రూ.10 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను తీసుకెళ్లిపోయారు.
చిత్తూరు నుంచి కార్వేటినగరం మండలానికి మద్యం లోడ్ తో వెళ్తున్న వ్యాన్ టైర్ పగిలిపోవడంతో బోల్తా కొట్టింది. మద్యం సీసాలు రోడ్డుపై పడటంతో అది చూసిన స్థానిక జనం మద్యం కాటన్ల కోసం ఎగబడ్డారు. కొందరు బాక్సులు ఎత్తుకుపోగా, మరికొందరు లుంగీలు, టవళ్లలో అందిన కాడికి మందు, బీరు సీసాలను ఎత్తుకెళ్లిపోయారు. తాగేటోళ్లతో పాటు తాగనోళ్లు కూడా మందు సీసాలను ఎత్తుకెళ్లిపోవడం చూస్తే..పుణ్యానికొస్తే ఏదైనా ఒకటేనన్నట్లుగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
బ్రేకింగ్
లిక్కర్ వ్యాను బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడిన జనం
చిత్తూరు జిల్లా ఎస్.ఆర్ పురం మండలం బసిరెడ్డిపల్లి వద్ద మద్యం వ్యాన్ బోల్తా
సుమారు రూ.10 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను తీసుకెళ్లిపోయిన స్థానికులు
చిత్తూరు నుంచి కార్వేటినగరం మండలానికి మద్యం లోడ్ తో వెళ్తున్న… pic.twitter.com/9X3hjbkAGq
— Telugu Feed (@Telugufeedsite) June 6, 2026
