Megastar Chiranjeevi | నేను ఏ పార్టీలో లేను..పిఠాపురం వెళ్లడం లేదు: చిరంజీవి
నేను ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో లేనని, పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం లేదని మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి స్పష్టం చేశారు
మెగాస్టార్ చిరంజీవి స్పష్టీకరణ
విధాత, హైదరాబాద్ : నేను ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో లేనని, పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం లేదని మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి స్పష్టం చేశారు. నేను ప్రచారానికి రావాలని నా తమ్ముడి ఎప్పుడు కోరుకోలేదని, నా నిర్ణయానికే వదిలేస్తాడన్నారు. తమ్ముడు పవన్ కల్యాణ్ తన జీవితంలో ఆశించిన స్థానాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానన్నారు. పవన్ రాజకీయం జీవితం బాగుండాలని, నా ఆశీస్సులు ఉంటాయని, నా తమ్ముడు గెలుపు కోసం, ఆయన రాజకీయంగా ఎదగాలని ఆక్షాంకిస్తూ ఇటీవల వీడియో విడుదల చేశానని, ప్రత్యక్ష ప్రచారానికి మాత్రం వెళ్లడం లేదన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram