కోవిడ్ నియంత్రణ పై ..మంత్రి ఆళ్ల సమీక్ష సమావేశం

➡️ రాష్ట్రములో కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ వేగవంతం చేయడానికి ఏపి వైద్య ఆరోగ్య శాఖ ముందోస్తు ప్రణాళిక రూపకల్పన.. ➡️ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తీవ్రత నివారణకు, వ్యాక్సిన్ వేగవంతం చేయడానికి, కరోనా బాధితులకు అందుతున్న వైద్యం,104 కాల్ సెంటర్, పలు అంశాలపై పై రాష్ట్ర సబ్ కమిటీ కన్వీనర్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ గోదావరి కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.. […]

కోవిడ్ నియంత్రణ పై ..మంత్రి ఆళ్ల సమీక్ష సమావేశం

➡️ రాష్ట్రములో కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ వేగవంతం చేయడానికి ఏపి వైద్య ఆరోగ్య శాఖ ముందోస్తు ప్రణాళిక రూపకల్పన..

➡️ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తీవ్రత నివారణకు, వ్యాక్సిన్ వేగవంతం చేయడానికి, కరోనా బాధితులకు అందుతున్న వైద్యం,104 కాల్ సెంటర్, పలు అంశాలపై పై రాష్ట్ర సబ్ కమిటీ కన్వీనర్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ గోదావరి కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు..

➡️ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ గత 24 గంటలలో 86,035 పరీక్షలు చేయగా పాజిటివ్ కేసుల సంఖ్య – 14,792 పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు..

➡️ రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తక్కువగా నమోదు కావడంతో సమర్థవంతంగా పని చేసిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన – మంత్రి ఆళ్ల నాని

➡️ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు 104 కాల్ సెంటర్ మరింత సమర్థవంతంగా పని చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు – మంత్రి ఆళ్ల నాని..

➡️ 104 కాల్‌ సెంటర్‌ పూర్తి స్థాయిలో సమర్థంగా పని చేసేలా శ్రద్ధ తీసుకోవాలి, ఆ నెంబర్‌కు ఫోన్‌ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలి..

➡️ 104 నెంబర్‌ అన్నది వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ అన్నది ప్రజల్లోకి బలంగా వెళ్లాలి, ఆ స్థాయిలో కాల్‌ సెంటర్‌ పని చేయాలి, 104కు ఫోన్‌ చేసిన వెంటనే 3 గంటల్లో బెడ్‌ కేటాయించాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నాము – మంత్రి ఆళ్ల నాని తెలిపారు..

➡️ జిల్లాలో కరణం టెస్టుల సంఖ్య మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన – మంత్రి ఆళ్ల నాని చెప్పారు..

➡️ ప్రభుత్వ ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్స చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులలో నాణ్యతతో కూడిన ఆహారం, శానిటేషన్, ఔషథాల లభ్యత, తగినంత మంది వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, హెల్ప్‌ డెస్క్‌లు వాటిలో ఆరోగ్యమిత్రలు, సీసీటీవీ కెమెరాలు పని చేస్తున్నాయా? లేదా? అన్నది ప్రతి రోజూ చూడాలి – మంత్రి ఆళ్ల నాని

➡️ కోవిడ్‌ వల్ల ఇప్పటికే అందరూ భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లేనిపోని పుకార్లు సృష్టించి, అసత్యాలు ప్రచారం చేస్తే, ప్రజల్లో ఆందోళన ఇంకా తీవ్రమవుతుంది, కాబట్టి అసత్య ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు – మంత్రి ఆళ్ల నాని..

➡️ గత 24 గంటల్లో సంభవించిన మరణాలు సంఖ్య –57 అని మంత్రి ఆళ్ల నాని చెప్పరు..

➡️ రాష్ట్రంలో ఇప్పటి వరకు చేసిన కోవిడ్ పరీక్షలు –1.63 కోట్లు మంత్రి ఆళ్ల నాని చెప్పారు..

➡️ ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసులు –10.84 లక్షలు – మంత్రి ఆళ్ల నాని..

➡️ ఇప్పటి వరకు రికవరీ అయిన కేసులు –9.62 లక్షలు – మంత్రి ఆళ్ల నాని ..

➡️ ప్రస్తుతం ఉన్న Active Cases –1,14,158 – ప్రస్తుతం ఉన్న Positivity Rate –6.59% – మంత్రి ఆళ్ల నాని ..

➡️ Recovery Rate –89.20% – Recovery Rate –82.10% – మంత్రి ఆళ్ల నాని..

➡️రాష్ట్రములో మరణాల రేటు –0.7%, మరణాల సంఖ్య –7,928 – మంత్రి ఆళ్ల నాని..

➡️ రాష్ట్రం మొత్తంలో పనిచేస్తున్న కోవిడ్ ఆసుపత్రులు -420 – మంత్రి ఆళ్ల నాని..

➡️ రాష్ట్రం మొత్తంలో అందుబాటులో ఉన్న COVID Beds (ICU) -5,601, ఆక్సిజన్ (o2) Beds-18,992, జనరల్ బెడ్స్ -11,920, ప్రస్తుతం Beds -36,513, ప్రస్తుతం Occupied Beds -20,556,అందుబాటులో ఉన్న Beds-15,957, అందుబాటులో ఉన్న Ventilators -3,120 – మంత్రి ఆళ్ల నాని తెలిపారు..

➡️ అదేవిధంగా రాష్ట్రములో మొత్తం పనిచేస్తున్న Covid Care Centers (CCC) -61, Covid Care Centers (CCC) లలో మొత్తం బెడ్స్ -34,233, Covid Care Centres లలో అడ్మిట్ అయిన patients -5,897, రాష్ట్రములో ప్రస్తుతం అందుబాటులో ఉన్న CCC Beds -28,336 – మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు..

➡️ రాష్ట్రంలో ప్రస్తుతం Home Isolation లో ఉన్న వారి సంఖ్య -47,164, రాష్ట్రములో ప్రస్తుతం Home Quarantine లో ఉన్న వారి సంఖ్య – 1,54,325 – మంత్రి ఆళ్ల నాని చెప్పారు..

➡️ ఈరోజు నాటికి రాష్ట్రంలో Vaccine 1st డోస్ తీసుకున్న వారి సంఖ్ – 49,83,238, 2nd డోస్ తీసుకున్న వారి సంఖ్య – 13,60,440, Vaccine తీసుకున్న మొత్తం లబ్దిదారుల సంఖ్య- 63.43 లక్షలు.. – మంత్రి ఆళ్ల నాని చెప్పారు..

➡️ ఇప్పటి వరకు మన రాష్ట్రం అందుకున్న Vaccines :
COVISHIELD – 53,70,040
COVAXINE – 12,14,560
Total 65,84,600

➡️ వ్యాక్సిన్ – అర్హుల సంఖ్య అర్హులు లబ్దిదారుల సంఖ్య 18-45 సంవత్సరాల వయస్సు గల వారు 2,04,70,364, 45 సంవత్సరాల పైబడిన వారు 1,33,07,889, HCW -5,13,204, FLW – 9,38,052, మొత్తం – 3,52,29,509 – మంత్రి ఆళ్ల నాని తెలిపారు..

➡️ అదేవిధంగా రాష్ట్రంలో గత మూడు రోజులుగా రెమిడెసీవిర్ వివరాలు 27.4.2021 – 6743, 28.4.2021- 5301, 29.4.2021- 3573 – మంత్రి ఆళ్ల నాని చెప్పారు..

➡️ కోవిడ్‌ నియంత్రణకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. శానిటైజర్లు వాడాలి. అదొక్కటే మనకున్న పరిష్కార మార్గం – మంత్రి ఆళ్ల నాని..

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహా నిర్మాణశాఖ మంత్రి రంగనాథ రాజు , జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు , గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంటట రావు , తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు , ఎంఎల్ సి సబ్జి , జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ , జిల్లా జాయింట్ కలెక్టర్లు హిమనుషు శుక్ల, వెంకటరమణ రెడ్డి, నంబురి తేజ్ భరత్, జిల్లా అధికారులతో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నత అధికారులు పాల్గొన్నారు..