Pawan Kalyan| అసెంబ్లీలో పవన్ కళ్యాణ్‌పై చంద్రబాబు స్టన్నింగ్ కామెంట్స్.. తెగ నవ్వేసిన డిప్యూటీ సీఎం
Pawan Kalyan| ఏపీ రాజకీయాలలో అనూహ్య పరిణాలమాలు చోటు చేసుకోవడం మనం చూశాం. జగన్ ప్రభుత్వాన్ని కూల్చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.అయితే ఈ విజయానికి ముఖ్య కారణం పవన్ కల్యాణ్ అని చెప్పాలి. ఓటు చీలనివ్వను, జగన్ నిన్ను గెలవనివ్వను, అథ:
Pawan Kalyan| ఏపీ రాజకీయాలలో అనూహ్య పరిణాలమాలు చోటు చేసుకోవడం మనం చూశాం. జగన్ ప్రభుత్వాన్ని కూల్చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.అయితే ఈ విజయానికి ముఖ్య కారణం పవన్ కల్యాణ్ అని చెప్పాలి. ఓటు చీలనివ్వను, జగన్ నిన్ను గెలవనివ్వను, అథ:పాతాళానికి తొక్కేస్తానంటూ పవన్ కళ్యాణ్ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ తాను చెప్పినట్లుగానే చేసి చూపించారు. ఎమ్మెల్యే సాబ్ అనిపించుకోవడానికి పదేళ్లుగా తపస్సు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎట్టకేలకి అది సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలిచి భారత రాజకీయ చరిత్రలోనే అరుదైన రికార్డును సాధించారు.

అయితే ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, చంద్రబాబు.. పవన్ కళ్యాణ్‌పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.. నాటి ప్రభుత్వ హయాంలో చంద్రబాబుని సీఐడీ అధికారులు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినప్పుడు బాబుని కలిసేందుకు పవన్ రోడ్డు మార్గంలో వెళుతుండగా, పోలీసులు అడ్డుకోవడం అప్పుడు పవన్ రోడ్డుపైన పడుకోవడం మనకు తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు.. ఎప్పుడూ సినిమాల్లో హీరోగా కొట్టడమే తెలిసిన పవన్ కల్యాణ్ కూడా రోడ్డుపై పడుకోవాల్సి వచ్చిందని బాబు అన్నారు. సినిమాల్లో అయితే పవన్ పడుకునేవారు కాదని.. అక్కడే పైకి ఎగిరి కొట్టేవారని అన్నారు. చంద్రబాబు అలా అనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూసాయి. డిప్యూటీ సీఎం పవన్ కూడా చిరునవ్వు చిందించారు.
ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన వచ్చింది. జగన్ హయాంలో ఏపీలో నెలకొన్న శాంతి భద్రతలపై చంద్రబాబు నాయుడు గురువారం శ్వేతపత్రం విడుదల చేసే సమయంలో పవన్ పెళ్లిళ్లను ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గాన్ని జగన్ ప్రశాంతంగా ఉండనివ్వలేదని.. విపక్ష నేతలను టార్గెట్ చేసి కేసుల మీద కేసులు పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబాలను రాజకీయాల్లోకి లాగొద్దని కూటమి సభ్యులకు కూడా కోరుతున్నాఅని చంద్రబాబు హితవు పలికారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ చేస్తే సహించేది లేదంటూ కూడా చంద్రబాబు స్పష్టం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram