పెద్దపులి ఆహారపు వేట.. గోమాతల పాలిట విషాదంగా మారింది. ఎక్కడి నుంచి వచ్చిందోగాని ఓ పెద్దపులి 14 లేగ దూడలను చంపడంతో వాటి తల్లి ఆవులు తమ పిల్లల కోనం తిండి, నీరు మారి అల్లాడిపోతున్నాయి. పోలవరం జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారక ఘటనలో బాధిత మూగజీవాల ఆవేదన చూపరులను కంట తడి పెట్టిస్తుంది. దేవీపట్నం మండలం గంగంపాలెంలో కోను అశోక్ దొరకు చెందిన పశువుల కొట్టంలో కట్టేసి ఉన్న ఆవుదూడలపై పెద్దపులి ఆకస్మికంగా దాడి చేసింది. ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 12 ఆవు దూడలను, 2 గేదె దూడలను పెద్దపులి పొట్టన పెట్టుకుంది. అలాగే దాసరి నాగేశ్వర్ రావు కు చెందిన రెండు గేదె దూడలను పులి చంపేసింది.
అశోక్ దొర తెల్లవారుజామున పశువుల కొట్టం వద్దకు వెళ్లేసరికి దూడలు అన్ని చనిపోయి కనిపించడంతో బాధతో కుప్పకూలిపోయాడు. అయితే తమ పిల్లలకు ఏమైందో తెలియక తిండి, నీరు మాని అల్లాడుతున్న తల్లి ఆవులు చనిపోయిన తమ దూడల చుట్టు అంబా అంటూ తిరుగుతూ రోధిస్తుండం అక్కడ ఉన్న వారిని కంట తడి పెట్టించింది. పశువుల పాక చుట్టూ తిరుగుతూ తల్లడిల్లిపోతున్న ఆవుల రోదన చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టేసుకుంటున్నారు. సృష్టిలో తల్లి బిడ్డల అనుబంధానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనంగా చూసి ఛలించిపోతున్నారు.
అవుదూడలను చంపిన పెద్దపులి జాడ కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గంగపాలెం కొండ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లుగా గుర్తించిన అధికారులు డ్రోన్ కెమెరాలతో పులి కదలికలపై నిఘా పెట్టారు.
పోలవరం జిల్లా..
దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో గత రాత్రి పశువుల మందపై పెద్దపులి దాడి
12 ఆవు దూడలు, రెండు గేదెలు మృతి.
గత కొన్ని నెలలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంచరిస్తూ భయాందోళనలు సృష్టిస్తున్న పులి.#TigerAttack #Devipatnam #Polavaram #EastGodavari #APNews pic.twitter.com/VaIk7kUIaI
— ANN Telugu (@ANN_Telugu) June 3, 2026
